టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ వివాదంతో సెన్సేషన్ సృష్టించింది నటి శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ ఒక్కటే కాదు దీనితో పాటు ఈమె మరి కొన్ని అంశాలను లేవనెత్తింది. అవి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకే మెయిన్ రోల్స్ ఇవ్వాలని, తెలుగు సినిమాలలో మెజారిటీ నటులు తెలుగు వారే ఉండాలని కోరింది. టాలీవుడ్ ని నాలుగు పెద్ద కుటుంబాలు ఏలుతున్నాయని కొత్త హీరోలకు, దర్శక, నిర్మాతలకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేసింది. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లకే అవకాశం ఇవ్వాలని, పక్క రాష్ట్రాల నుండి తీసుకురాకూడదని ఈమె చేసిన ఈ డిమాండ్ ఆమె మెడకే చుట్టుకుంది.
తమిళ లీక్స్ మొదలెట్టి చెన్నైకి మకాం మార్చిన శ్రీరెడ్డిపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజెన్లు. చెన్నై వెళ్ళాక శ్రీరెడ్డి పలు ఇంటర్వ్యూల్లో నేను తెలుగు, తమిళ అమ్మాయిలకు జరిగిన అన్యాయం మీద పోరాటం చేస్తాను. నాకు కోలీవుడ్ లో అవకాశాలు వస్తే ఇక్కడే సెటిల్ అయిపోతాను అంటూ వెల్లడించింది. దీంతో శ్రీరెడ్డిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు శ్రీరెడ్డి యాంటీ ఫ్యాన్స్.
తెలుగమ్మాయిల కోసం పోరాటం చేస్తాను అని తమిళనాడు ఎందుకు వెళ్ళావ్? ఇక్కడ ఏం సాధించావని కోలీవుడ్ లో పోరాటం చేస్తున్నావ్? తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేసి కోలీవుడ్ లో నటిస్తానని ఎందుకు చెబుతున్నావ్? పక్క రాష్ట్రాల హీరోయిన్లు టాలీవుడ్ లో నటించకూడదు అని అడిగిన నీకు తమిళ ఇండస్ట్రీలో కూడా అదే రూల్ వర్తిస్తుందని తెలియదా? నువ్వు ఎక్కడైనా నటించొచ్చు కానీ వేరే హీరోయిన్లు టాలీవుడ్ లో నటించకూడదా శ్రీరెడ్డి అంటూ ఫేస్బుక్ లో ఆమెను ప్రశ్నిస్తున్నారు సినీ అభిమానులు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ అంటూ శ్రీరెడ్డిని ఇరికించేశారు నెటిజెన్లు. తన చర్యలకు ఎవరైనా రియాక్ట్ అయితే వెంటనే పోస్టు పెట్టి అడ్డమైన తిట్లు తిట్టే శ్రీరెడ్డి ఈ విషయంలో మాత్రం సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయింది.