“సర్కార్ “సినిమాకు ప్రభుత్వ షాక్ 

సన్ పిక్చర్ వారు విజయ్ హీరోగా  మురగదాస్  దర్శకత్వంలో  తమిళంలో నిర్మించిన అత్యత భారీ బడ్జెట్  సినిమా”సర్కార్” కు  మరో షాక్ తగిలింది . దీని కథ నాదంటూ వచ్చిన వివాదాన్ని రచయిత , దర్శకుడు భాగ్యరాజా పరిష్కరించాడు . దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమం  అయ్యిందని నిర్మాత దర్శకులు సంతోషపడ్డారు . విజయ్  అభిమానులు సినిమా విడుదలకు ముందే తమ హీరో కటవుట్లు కు పూజలు జరుపు కోవడం, థియేటర్ లలో డెకరేషన్ చేసుకోవడం మొదలు పెట్టారు . అంతా ఆనందంగా వున్నా సమయంలో ఊహించని షాక్ తగిలింది . 
దీపావళి కానుకగా “సర్కార్ ” నవంబర్ 6 న ప్రపంచ వ్యాప్తంగా  విడుదల చేయడాని సిద్ధమవుతున్నారు . తమిళనాడు అంతటా  విజయ పోస్టర్లు , కటవుట్లు  భారీగా ఏర్పాటు చేశారు . అయితే విజయ స్టైలిష్ గా సిగరెట్  తాగే పోస్టర్లు , కటవుట్లు  వెంటనే తొలగించాలని తమిళ నాడు  ప్రభుత్వం నిర్మాతకు నోటీసు పంపింది . అతికించిన వాల్ పోస్టర్లు , రోడ్ల మీద పెట్టిన అతి భారీ కటవుట్లు వెంటనే  తొలగించాలని అందులో పేర్కొన్నారు . 
“సర్కార్ ” సినేమా ఇప్పుడు ప్రభుత్వ చర్య నుంచి ఎలా బయట  పడుతుందో ?