గాసిప్స్ : ప్రభాస్ “ఆదిపురుష్” కూడా రెండు భాగాలుగానా..?

ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ ని రేపినటువంటి లేటెస్ట్ చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న భారీ చిత్రం “ఆదిపురుష్”. ప్రభాస్ హీరోగా చేసినటువంటి ఈ సినిమా రామాయణం ఆధారంగా దర్శకుడు ఓంరౌత్ భారీ విజువల్ డ్రామాగా తెరకెక్కించారు.

మరి ఈ సినిమా నుంచి అయితే ఫైనల్ గా ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యగా దీనికి అయితే ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ అప్డేట్ తో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమా అంతా ఆసక్తిగా ఈ సినిమా కోసమే మాట్లాడుకుంటుంది.

అయితే ఇంకో పక్క ఈ చిత్రం రిలీజ్ విషయంలో అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ గాసిప్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. చాలా వరకు ఈరోజు అప్డేట్స్ లో చూసినట్టు అయితే “ఆదిపురుష్ ఆరంభం” అని టాగ్ కనిపిస్తుంది. అంటే ఓ రకంగా ఇదే మొదటి సినిమా అన్నట్టుగా వెళ్తుంది.

దీనితో ఇపుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందా రెండు భాగాలుగా సినిమా చేస్తున్నారా అనే అంశాలు ఆసక్తిగా మారాయి. అయితే ప్రస్తుతానికి సినిమా అయితే కేవలం ఒక్క పార్ట్ గానే ఉంటుంది అని సమాచారం. మరి ఈ గాసిప్స్ నిజం అవుతాయో లేదో కొన్నాళ్ళు వేచి చూడాలి.