గాసిప్స్ : ప్రభాస్ భారీ సినిమాకి పోటీగా ఒకే డేట్ లో బాలయ్య రాబోతున్నాడా?

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి కూడా రెడీగా ఉన్న పలు చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “ఆదిపురుష్” కూడా ఉంది. మరి చిత్ర యూనిట్ ఎప్పుడో ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా అందులోని ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

మరి ఇలాంటి సినిమా పోటీలో పలు సినిమాలు వెనక్కి తగ్గాల్సిందే అని చెప్పాలి. ఇక అయితే ఇదే సినిమా ఉన్న రేస్ సంక్రాంతి బరిలో పోటీ తప్పనిసరి కానీ ఒకో రోజు గ్యాప్ తో సినిమాలు వస్తున్నాయి కానీ అనూహ్యంగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో షాకింగ్ గాసిప్ ఇప్పుడు వినిపిస్తుంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ ఏదైతే ఉందో జనవరి 12 నే బాలయ్య నటించిన సాలిడ్ మాస్ సినిమా కూడా రిలీజ్ కి వస్తుందని తెలుస్తుంది. బాలయ్య మరియు గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా ప్లాన్ చేసి తెరకెక్కిస్తున్నారు.

మరి ఈ సినిమానే మేకర్స్ అదే ఆదిపురుష్ రిలీజ్ డేట్ జనవరి 12న లాక్ చేస్తున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇది ఓ రకంగా షాకింగ్ స్టెప్ అని చెప్పాలి కానీ ప్రస్తుతానికి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ రెండు ఒకేరోజు వస్తే ఎలా ఉంటుందో కూడా చూడాలి.