ఈ దశాబ్దపు ఎనిమిదవ వింత ఈ పెళ్లే!
కాలం మారుతోంది. మనుషులూ మారుతున్నారు. వారి అభిరుచులు మారుతున్నాయి. వింత పోకడలకు ఈ దశాబ్దం వేదికగా మారుతోంది. ఈ అనంత కోటి విశ్వంలో వింతలూ విడ్డూరాలు వున్నట్టే అనంతకోటి జీవరాశుల్లో అత్యంత తెలివిగలవాడైన మానవజాతిలోనూ కొత్త కొత్త వింతలు చోటుచేసుకుంటున్నాయి. వివాహ వ్యవస్థ అన్నది ఇద్దరు ఆడ, మగ కలిసి వుండేందుకు ఏర్పరచిన పురాతన సంప్రదాయం. కానీ దానికి కాలం చెల్లుతోంది. వింత వింత బంధాలు పుట్టుకొస్తున్నాయి. ఈ అధునిక యుగంలో వింత సంబంధాలు వెలుగులోకి వచ్చి సభ్యసామాజం నివ్వెరపోయేలా చేస్తున్నాయి.
తాజాగా ఇలాంటి ఘటనే ఇటీవల అత్యంత హైటెక్ నగరం అవకాశాలకు స్వర్గ ధామంగా పిలవబడే అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలో గత కొన్నేళ్లుగా నివాసం వుంటున్న అమిత్ షా, ఆదిత్య మాదిరాజు గత కొంత కాలంగా ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు. దాంతో ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. అది పెళ్లికి దారితీసింది. దీంతో క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లికి రెడీ అయిపోయారు. సాంప్రదాయ బద్ధంగా తమ వివాహ వేడుకని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతకు ముందు ప్రీవెడ్డింగ్ షూట్ కోసం ప్రత్యేకంగా డ్రెస్ కోడ్‌ని మెయింటైన్ చేసిన అమిత్ షా, ఆదిత్య మాదిరాజు ఆ వీడియోని సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో వీరి పెళ్లి వార్త వైరల్‌గా మారింది.
వీరిద్దరి వెడ్డింగ్ అమెరికా నగరంలోని న్యూ జెర్సీలో అత్యంత స్టైలిష్‌గా సంప్రదాయ పద్దతిలో జరగడంతో అంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఈ పెళ్లి కోసం ఇద్దరు ప్రత్యేకంగా కుర్తాలని డిజైన్ చేయించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి ఉదంతంతో ప్రేమ చాలా పవర్‌ఫుల్ అని దాన్ని అడ్డగోడలుగా కులం, మతం, ఆడ, మగా నిలబడలేదని స్పష్టమైంది. అచ్చుం నూతన వధూవురులు ఫొటోలకు పోజులు ఇచ్చినట్టుగానే ఈ ఇద్దరూ ఫొటోలకు నోజులు ఇవ్వడం వీరి పెళ్లిని ఇరు కుటుంబాల పెద్దలు ఈజీగానే యాక్సెప్ట్ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడ ఇంకో విషయం ప్రత్యేకంగా చెప్పాలి. నూతన వధూవరులు పెళ్లికి ముందు మెహందీ ఫంక్షన్‌ని చేసుకుంటారు. ఇదే తరహాలో అమిత్ షా, ఆదిత్య మాదిరాజు ల మెహందీ ఫంక్షన్ జరగడం ఏడో వింతగా చెప్పుకోవచ్చు. వింత సంప్రదాయానికి తెరలేపిన అమిత్ షా, ఆదిత్య మాదిరాజు ల వివాహం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.