ఊహించని వసూళ్లతో వాల్మీకి దూకుడు
`గద్దలకొండ గణేష్` ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద గత్తర లేపిండు. మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్, హరీష్ శంకర్‌ల కలయికలో వచ్చిన ఈ చిత్రం రిలీజ్ ముంగిట టైటిల్ మార్పు అవాంతరాన్ని దాటి ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డీసెంట్ ఓపెనింగ్స్‌ని రాబట్టింది. తొలి రోజు ఐదున్నర కోట్లకు పైగా షేర్‌ని సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన హవాని కొనసాగిస్తున్నాడు. ఓవర్సీస్‌లోనూ గద్దలకొండ హవా మామూలుగా లేదు. ఊర మాస్ సినిమా అయినా ఈ చిత్రానికి భారీ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. గద్దలకొండ హవాతో గత వారం విడుదలైన నాని సినిమా గ్యాంగ్‌లీడర్‌కు పూర్తిగా బ్రేకులు పడిపోయాయని ట్రేడ్ చెబుతోంది.
ఓవర్సీస్‌లో నాని సినిమాతో పోలిస్తే గద్దలకొండ గణేష్ అలియాస్ వాల్మీకి మంచి ఓపెనింగ్స్‌ని రాబట్టి ముందు వరుసలో నిలిచింది. నాని గ్యాంగ్‌లీడర్‌ని వంద లొకేషన్‌లలో రిలీజ్ చేస్తే `గద్దలకొండ గణేష్` చిత్రాన్ని 146 లొకేషన్‌లలో రిలీజ్ చేశారు. ఇప్పటికి 84,872 డాలర్లు సాధించి వరుణ్ నటించిన మిస్టర్ ఫుల్ రన్ కలెక్షన్‌లని అధిగమించింది. ఇప్పటి వరకు నానీస్ గ్యాంగ్‌లీడర్` ఓవర్సీస్ లో 6 కోట్ల 45 లక్షల గ్రాస్‌ని వసూలు చేసింది. అయితే ఈ సినిమా మరింతగా వసూళ్లని సాధించడానికి `గద్దలకొండ గణేష్` ప్రతిబంధకంగా మారింది. నానీ చిత్రానికి ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీగా కలెక్షన్‌లు తగ్గగా ఓవర్సీస్‌లో 50 శాతం పడిపోయాయి. ఇక మీదట మరింతగా తగ్గే అవకాశం వుందని, గద్దలకొండ నానికి గట్టి పోటీనిచ్చి ఇక్కడా అక్కడా గత్తరలేపుతున్నాడని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.