సినిమా చేయనంటే బలవంతంగా చేయించాడు.. నిర్మాతపై నాని కామెంట్స్

Nani about Ride and Bellamkonda suresh In Alludu Adhurs Trailer Event

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండకపోవచ్చు. మనకు నచ్చకపోయినా ఎదుటి వారి కోసం చేయాల్సి వస్తుంది. అలాంటి కొన్ని సందర్భాల్లో అలా చేసిన పనులు మనకు కలిసిరావొచ్చు. న్యాచురల్ స్టార్ నాని విషయంలో అలాంటి సందర్భం ఒకటి జరిగింది. ఓ సినిమా చేయనని నిర్మాతకు చెబితే.. పట్టుబట్టి మరీ చేయించాడట. చివరకు అదే అతనికి కలిసి వచ్చిందట. ఈ విషయాన్ని నాని తాజాగా బయట పెట్టేశాడు. తాజాగా నాని చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

Nani about Ride and Bellamkonda suresh In Alludu Adhurs Trailer Event

తాజాగా నాని అల్లుడు అదుర్స్ సినిమా ట్రైలర్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. నిన్న ఈ మూవీ ట్రైలర్‌ను ప్రసాద్ ల్యాబ్‌లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు వివి వినాయక్, నాని ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బెల్లంకొండ సురేష్ ఈ ఇద్దరిని పట్టుబట్టి మరీ పిలిచాడట. తాను షూటింగ్‌లతో బిజీగా ఉన్నా కూడా రావాలని బెల్లంకొండ సురేష్ కోరాడని నాని చెప్పుకొచ్చాడు. అలా షూటింగ్ గ్యాప్‌లో ఇక్కడకు వచ్చానని నాని కంగారు కంగారుగా మాట్లాడేశాడు.

ఓ రెండు నిమిషాలు మాట్లాడిన నాని తన గతంలో జరిగిన సంఘటన గురించి చెప్పాడు. రైడ్ సినిమాను చేయాలన్న ఉద్దేశ్యం తనకు లేదని, కానీ బెల్లంకొండ సురేష్ పట్టుబట్టి మరీ చేయించాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.. నాకు బాగా ప్లస్ అయింది.. ఇప్పుడు ఇక్కడి కూడా పట్టుబట్టి మరీ రప్పించాడు.. ఇది కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నాను అంటూ నాని చకచకా మాట్లాడేసి వెళ్లిపోయాడు. షూటింగ్ ఉంది.. అందుకే వెళ్తున్నానను క్షమించండంటూ చెప్పేశాడు.