ఫీజు కట్టవా భారతి.. రాజమౌళి లో ఈ యాంగిల్ కూడా ఉందా!

అమెజాన్ ప్రైమ్ లో ద రాణా దగ్గుపాటి షోలో రాణా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పలువురు సినీ సెలబ్రిటీలను ఆ షో కి ఆహ్వానించి వారితో చిట్ చాట్ చేస్తూ ఉంటాడు రాణా. ప్రతి వీకెండ్ ఒక్కొక్క ఎపిసోడ్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇదివరకే నాని, సిద్దు జొన్నలగడ్డ, శ్రీ లీల, నాగచైతన్య తదితరులు పాల్గొన్నారు. తాజాగా రాజమౌళి రామ్ గోపాల్ వర్మతో మాట్లాడిన ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు.

అందులో రాజమౌళి తన టీనేజ్ లవ్ స్టోరీ గురించి చెప్పటం విశేషం. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం ఉండేది కానీ మాట్లాడాలంటే భయం. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని క్లాసులో ఉన్న అబ్బాయిలు అందరికీ తెలుసు, ఆ విషయం పై నన్ను ఏడిపిస్తూ ఉండేవారు అయితే చాలా కష్టం మీద ఆ అమ్మాయితో ఒకసారి మాట్లాడాను. ట్యూషన్ ఫీజు కట్టవా భారతి అని అడిగాను. దాంతో ఆ అమ్మాయి వెనక్కి తిరిగి నన్ను చూసిన చూపు ఇప్పటికీ మర్చిపోలేను.

ఈగ సినిమాలో నాని, సమంత మధ్య ఇలాంటి సినిమాలే ఉంటాయి. చాలామంది దర్శకులు ఇలాగే తమ అనుభవాలను తెరపై తీసుకొస్తారు అని చెప్పుకొచ్చాడు. తర్వాత చాలా విషయాల గురించి మాట్లాడిన రాజమౌళి తనకి మిస్సమ్మ సినిమా అంటే చాలా ఇష్టం అని తను, తన తండ్రి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు తండ్రి కొడుకులమన్న విషయం అసలు గుర్తుండదు ఒక రచయిత దర్శకుడు అన్నట్లుగానే మా మధ్య చర్చ జరుగుతుంది అని చెప్పాడు.

తర్వాత సినిమాల గురించి మాట్లాడుతూ నేటితరం వందల కొద్ది పేజీలున్న పుస్తకాలను చదవమంటే ఆసక్తి చూపించరు అందుకోసం వాళ్లకి షాట్ వెర్షన్ అందించాలి అది నచ్చితే మొత్తం పుస్తకం చదువుతారు. పాత సినిమాలను అలాగే షార్ట్ చేసి నేటి తరానికి అందించాలి, ఒకవేళ నచ్చితే పూర్తి మూవీ చూస్తారు ఇది ఒక ఆలోచన మాత్రమే అని చెప్పినా రాజమౌళి తన అభిమాని నటుడు ఎన్టీఆర్ అని ఆయన సినిమాలు ఎక్కువగా చూసే వాడినని చెప్పుకొచ్చాడు.