అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన కంగువ.. స్ట్రీమింగ్ ఎక్కడుంటే!

తమిళ నటుడు సూర్య హీరోగా నటించిన కంగువ సినిమా భారీ అంచనాలతో నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు దర్శక నిర్మాతలు ఈ సినిమాకి విపరీతమైన హైప్ తీసుకువచ్చే కామెంట్లు చేశారు. కోలీవుడ్ కి బాహుబలి, కచ్చితంగా 1000 కోట్లు వసూలు చేస్తుంది అంటూ ప్రచారం చేశారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది.

నిజానికి సూర్య నటించే చిత్రాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హీరోఇజం చూపించే సినిమాలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలని చేయటానికి ఇష్టపడతాడు సూర్య. అలాగే చాలా సక్సెస్లు సాధించాడు కూడా. ఆకాశం నీ హద్దురా సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న సూర్య కంగువా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. తెలుగులో శౌర్యం, దరువు వంటి చిత్రాలతో పర్వాలేదు అనిపించుకున్న దర్శకుడు శివ.

తమిళంలో అజిత్ హీరోగా కూడా చాలా సినిమాలు చేశాడు ఈ దర్శకుడు అతడిని నమ్మి కంగువ సినిమా చేశాడు సూర్య. సినిమాలో నటనపరంగా అతనికి ప్రశంసలు లభించినప్పటికీ సినిమాలో సాగదీత ఎక్కువగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. నెల తిరగకముందే ఓటిటిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు డిసెంబర్ 8న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

రష్యా కు చెందిన కొందరు శాస్త్రవేత్తలు పిల్లలను బంధించి వారిపై ప్రయోగాలు చేస్తూ ఉండటం వారి నుంచి తప్పించుకున్న ఒక పిల్లవాడు సూర్య దగ్గరికి చేరటం , అసలు ఆ పిల్లవాడు ఎవరు, సూర్యకి అతనికి వున్న సంబంధం ఏమిటి అసలు ఈ కంగువ ఎవరు అనేది ఈ చిత్రం. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశాపఠాని హీరోయిన్గా నటించగా బాలీవుడ్ నటుడు బాబి డియోల్ విలన్ గా నటించాడు. ఇంత భారీతారాగణం ఉన్నా ఈ సినిమా మూడువారాలలోనే ఓటీటీలోకి రావడం గమనార్హం.