(సూర్యం)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతున సంగతి తెలిసిందే. చంద్రోదయం అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ రానున్న దసరా సీజన్‌లో విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ తాజాగా చంద్రోదయం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టరే ఇప్పుడు కామెడీగా మారింది.
ముఖ్యంగా చంద్రబాబు పాత్రలో కనిపిస్తున్న ఆ నటుడు సూటవ్వలేదు. పోనీ సూటయ్యేలాగ సరైన మేకప్ వేయలేదు. గడ్డం చాలా అసహజంగా …. ఏదో పెయింట్ వేసినట్లుగా ఉంది. బాడీ లాంగ్వేజ్ అయితే చంద్రబాబుని గుర్తు తేవటం లేదు. కేవలం చంద్రబాబు తరహాలో డ్రెస్సింగ్ చేసి వదిలేసారు. అంతేకాదు…ఇక్కడ ఫొటోలో చూపించినట్లు ఆ పోస్టర్ లో కొంత తేడా కనపడుతోంది. అది కూడా నిర్మాతలు చూసుకోలేదు.
అయితే గ్రాండ్ గా ఈ చిత్రానికి ‘బయోపిక్ ఆఫ్ లివింగ్ లెజెండ్’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇది అసలు బయోపికా.. లేక స్ఫూఫా అనే డౌట్ కూడా సోషల్ మీడియా జనం వ్యక్తం చేస్తున్నారు. జీజేవీకే రాజేంద్ర ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. వెంకట రమణ నిర్మిస్తున్నాడు. చంద్రబాబు పాత్రలో వినోద్ నటిస్తుండగా ఎన్టీఆర్ పాత్ర భాస్కర్ పోషిస్తున్నారు.