ఇండస్ట్రీ టాక్ : ప్రభాస్ మళ్ళీ రెడీ అంటున్నాడా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి మరణం టాలీవుడ్ లో సహా ప్రభాస్ ఇంట తీరని విషాదం నెలకొంది. దీనితో టాలీవుడ్ నుంచి అనేకమంది సినీ ప్రముఖులు ప్రభాస్ ఇంటికి చేరి నివాళులు అర్పించారు.

మరి ఇదిలా ఉండగా ఈ విషాదకర ఘటన నుంచి ప్రభాస్ తమ ఇంట ముందు ఉండి అందరికీ ధైర్యం చెప్పి తర్వాతి కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నాడు. నిన్ననే కృష్ణం రాజు విగ్రహావిష్కరణ లో కూడా పాల్గొన్నాడు. అయితే ఇదిలా ఉండగా ప్రభాస్ అయితే ఈ విషాదం నుంచి తన కెరీర్ పై మళ్ళీ దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఇపుడు ప్రభాస్ స్టార్ట్ చేసిన సినిమాలు రెండు ఉండగా ఈ సినిమాల షూటింగ్స్ కి అయితే తాను రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం ప్రకారం అయితే ప్రభాస్ ఈ సెప్టెంబర్ చివరి వారం నుంచి తన సినిమాలు సలార్ అలాగే ప్రాజెక్ట్ కే లను మళ్ళీ స్టార్ట్ చేయనున్నాడట.

ఇంత తక్కువ సమయంలో తాను తేరుకొని చేయడం మంచి విషయమే అని చెప్పాలి. అయితే ఈ సినిమాలు మధ్యలో ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో ప్రభాస్ అయితే వాటికి నటీనటుల డేట్స్ కి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది.