కాస్ట్ ప్లాబ్లం..అసలు మీ కాస్ట్ ఏంటి? డైరక్ట్ గా అడిగేసింది

బాహుబలి 2 లో సేతుపతి క్యారెక్టర్‌తో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు రాకేష్ హీరోగా నటిస్తున్న సినిమా.. ఎవ్వరికీ చెప్పొద్దు.. గార్గేయి ఎల్లాప్రగడ హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, హీరోగా నటిస్తున్న రాకేషే నిర్మిస్తున్నాడు. బసవ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఎవ్వరికీ చెప్పొద్దు ట్రైలర్ రిలీజ్ చేసారు. కులం తో ఇబ్బందులు పడే ప్రేమ కథ అని చూస్తే అర్దమవుతోంది. మీరూ ఓ లుక్కేయండి..

Evvarikee Cheppoddu Theatrical Trailer 4K || Rakesh Varre, Gargeyi Yellapragada || Basava Shanker

ఈ చిత్రానికి కథను అందిస్తూ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు బసవ శంకర్‌ ఏడాది. శంకర్‌ శర్మ బాణీలు సమకూరుస్తున్నారు. రాకేష్‌ వర్రె నిర్మిస్తున్నారు. త్వరలో ఎవ్వరికీ చెప్పొద్దు రిలీజ్ కానుంది. ఈ సినిమాకి కెమెరా : విజయ్.జె.ఆనంద్, ఎడిటర్స్ : బసవ శంకర్, తేజ ఎర్రంశెట్టి, సత్యజిత్ సుగ్గు, మ్యూజిక్ : శంకర్ శర్మ, లిరిక్స్ : వాసు, లైన్ ప్రొడ్యూసర్ : కేతన్ కుమార్.