30 మంది కలిసి 25 ఏళ్ల కుర్రాడిని చంపేసారు..ఆ కథే

‘జార్జ్‌రెడ్డి’ట్రైలర్ వచ్చేసింది

ఎదురుచూస్తున్న ‘జార్జ్‌రెడ్డి’ సినిమా ట్రైలర్‌ వచ్చేసింది. 1970 సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నేతగా ఎదిగిన జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడి, లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి గురించి ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చేమో కానీ, 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన గురించి తెలుసు. ఆ స్దాయి ఉద్యమ నాయకుడి గురించి ఈ తరం తెలుసుకునేలా రూపొందిస్తున్న సినిమా.. ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్) . దసరా సందర్భంగా చిత్ర యూనిట్‌ జార్జ్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ చేశారు.

‘పేదలు ఇంకా పేదలు అవుతున్నారు.. ధనికులు ఇంకా ధనికులుగా మారుతున్నారు..’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. కళాశాలలో కలహాలు, న్యాయం కోసం విద్యార్థుల పోరాటాలు.. ఇలా వివిధ అంశాలను చూపించారు. ‘నిజం చచ్చిపోయేలోపే మీ గళం విప్పండి..’ అంటూ జార్జ్‌ రెడ్డి పాత్ర యువకుల్లో చైతన్యం నింపుతూ కనిపించింది. ఈ చిత్రానికి జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటించారు. అప్పిరెడ్డి నిర్మాత. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు.

George Reddy Official Trailer | Sandeep Madhav, Satyadev | Jeevan Reddy | Sudhakar Yakkanti

వంగవీటి మూవీతో ఆకట్టుకున్న సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి క్యారెక్టర్‌‌లో ఒదిగిపోయాడనే చెప్పాలి. సత్యదేవ్, మనోజ్ నందం, అభయ్ బేతిగంటి ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. చేశారు. ఉస్మానియాలో ఉన్న సమయంలో ఉద్యమాల వైపు ఆకర్షితుడైన జార్జ్ రెడ్డి అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య (పీడీఎస్‌యు)ను స్థాపించారు. ఈ సమాఖ్య భారతీయ కమ్యూనిస్టు పార్టీ (ఎంఎల్) విద్యార్థి విభాగం అనుబంధ సంస్థ గా పనిచేసేది. 25 ఏళ్ల వయసులో, ఉస్మానియా క్యాంపస్‌లో.. దాదాపు మంది మూకుమ్మడిగా కత్తులతో దాడి చేసి జార్జ్ రెడ్డిని హత్య చేసారు. ఇప్పుడు ఆయన జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. త్వరలోనే విడుదల తేదీలను ప్రకటించనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కెమెరా : సుధాకర్ యెక్కంటి, సంగీతం : సురేష్ బొబ్బిలి, బ్యాగ్రౌండ్ స్కోర్ : హర్ష వర్ధన్ రామేశ్వర్, సహ నిర్మాత : సంజయ్ రెడ్డి, అసోసియేట్ ప్రొడ్యూసర్స్ : దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి.