మావోయిస్టు అక్క పోలీస్ తమ్ముడు మధ్య ఎన్‌కౌంటర్‌…

మావోయిస్టు అక్క పోలీస్ తమ్ముడు మధ్య ఎన్‌కౌంటర్‌…

వెట్టి రామ(43) వెట్టి కన్ని(50) ఇద్దరూ సొంత అక్కా తమ్ముడు. 1990లో ఇద్దరు మావోయిస్టు దళంలో చేరారు. చేరడమే కాకుండా అనేక హింసాత్మక ఘటనల్లో పాలుపంచుకున్నారు. అయితే ఇటీవల 2018 లో స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయాడు వెట్టి రామ. అప్పటి ఎస్పీ రాజేంద్రనాథ్ దాస్ రామ్ ని మెచ్చుకొని పోలీస్ ఉద్యోగం ఇప్పించాడు. అప్పటినుండి వెట్టి రామ పోలీస్ గా కొనసాగుతున్నాడు. అతనికి ఏఎస్‌ఐగా పదవి పదోన్నతి కూడా లభించింది.

ఈ నేపథ్యంలో పోలీసులకు లొంగి పోవాలని అనేకసార్లు వెట్టి రామ తన అక్కకు ఎన్నో లేఖలు రాశాడు. అయినా ఆమె లొంగిపోలేదు. దళంకి మోసంచేయలేను అని చెప్పి మావోయిస్టు గా కొనసాగింది. అయితే విధినిర్వహణలో ఉన్న వెట్టి రామకి ఈమధ్య ఒక మావోయిస్టు దళం ఎదురుపడింది. ఎదురు పడిన దళంలో అక్క వెట్టి కన్ని కనిపించింది. అయినా ఏమాత్రం సంకోచించకుండా వెట్టి రామ తుపాకీతో గుళ్ల వర్షం కురిపించాడు. అయితే ఆమె క్షణకాలంలో తప్పించుకు పోయింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సభ్యులు మృతి చెందారు. వృత్తి పట్ల వెట్టి రామ చూపించిన అంకితభావానికి ఉన్నతాధికారులు అతన్ని ప్రశంసలతో ముంచెత్తారు