థాంక్స్ టు కొవిడ్ 19.. OTTలో 10 కొత్త‌ సినిమాలు

Amazon Prime Video

కొవిడ్ 19 మహమ్మారితో ప్ర‌పంచం అల్ల క‌ల్లోలంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌పై పిడుగులా ప‌డింది వైర‌స్. దీంతో సినిమా వ్యాపారంలో కొన్ని మునుపెన్న‌డూ ఊహించని మార్పులొచ్చాయి. గ‌త రెండు నెల‌లుగా దేశవ్యాప్తంగా థియేటర్లు నిరవధికంగా మూసివేయబడటంతో, నిర్మాతలు ఇప్పుడు తమ సినిమాల్ని ఎలా రిలీజ్ చేయాలా? అన్న టెన్ష‌న్ తో ఉన్నారు. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో డైరెక్ట్-టు-డిజిటల్ విడుదల ఆల్ట‌ర్నేట్ ఆప్ష‌న్ గా క‌నిపిస్తోంది. అమెజాన్- నెట్ ఫ్లిక్స్ స‌హా వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో నేరుగా ప్రదర్శించనున్న‌ చిత్రాల జాబితాని ప‌రిశీలిస్తే..

లక్ష్మీ బాంబ్: రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన కాంచ‌న హిందీ రీమేక్. అక్షయ్ కుమార్ -కియారా అద్వానీ జంట‌గా న‌టించారు.

గులాబో సీతాబో: షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన చిత్ర‌మిది. అమితాబ్ బచ్చన్ – ఆయుష్మాన్ ఖురానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు.

శకుంతల దేవి: విద్యాబాలన్ నటించిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్తపై బయోపిక్. అనుమీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది.

ఘూమ్‌కేటు: నవాజుద్దీన్ సిద్దిఖీ ప్ర‌ధాన పాత్ర‌లో అనురాగ్ కశ్యప్ నిర్మించిన చిత్ర‌మిది. పుష్పేంద్ర నాథ్ మిశ్రా దర్శకత్వం వహించారు.

సైనా: తారే జమీన్ పర్ ఫేమ్ అమోల్ గుప్తే దర్శకత్వం వహించిన బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ పై బయోపిక్. పరిణీతి చోప్రా టైటిల్ పాత్ర పోషించింది.

గుంజన్ సక్సేనా- ది కార్గిల్ గర్ల్: కరణ్ జోహార్ నిర్మించిన చిత్ర‌మిది. జాన్వీ కపూర్ క‌థానాయిక‌గా న‌టించ‌గా.. శరణ్ శర్మ దర్శకత్వం వహించారు

లూడో: అభిషేక్ బచ్చన్, రాజ్‌కుమార్ రావు, సన్యా మల్హోత్రా, ఫాతిమా సనా షేక్ నటించిన డార్క్ కామెడీ. అనురాగ్ బసు దర్శకత్వం వహించారు.

జుంద్‌: అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించ‌గా.. సైరాత్ ఫేమ్ నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించారు.

ఇవేగాక ప‌లు తెలుగు సినిమాలో ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అలాగే త‌మిళ చిత్రాల్ని రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో 30 రోజుల్లో ప్రేమించ‌డమెలా?.. వీ వంటి చిత్రాలు ఓటీటీలో రానున్నాయ‌ని స‌మాచారం. త‌మిళంలో జ్యోతిక న‌టించిన చిత్రం రిలీజ‌వుతోంది.

ఈ చిత్రాలన్నీ నెట్‌ఫ్లిక్స్, డిస్నీ స్టార్, హాట్‌స్టార్, జీ 5, అమెజాన్ ప్రైమ్ వంటి వివిధ ప్లాట్‌ఫామ్‌లపై నేరుగా విడుదల కానున్నాయి.