సాహోపై దుబాయ్ ప్రివ్యూ రిపోర్ట్ ఇంట్రెస్టింగ్

ప‌్ర‌భాస్ డ‌బుల్ గేమ్.. గ‌జ‌దొంగ వ‌ర్సెస్ పోలీసాఫీస‌ర్!

ప్ర‌భాస్ `సాహో` మ‌రో నాలుగు రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అభిమానుల్లో ఉత్కంఠ అంత‌కంత‌కు పెరుగుతోంది. సాహో ఎలాంటి రికార్డులు సృష్టించ‌బోతోంది? అన్న ఆస‌క్తి అటు అభిమానుల్లో ఇటు ట్రేడ్ వ‌ర్గాల్లోనూ నెల‌కొంది. ఈ ఉత్కంఠ‌ను మ‌రింత పెంచేలా దుబాయ్ నుంచి ప్ర‌ఖ్యాత క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్లు వేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అత‌డు దుబాయ్ లో ప్రివ్యూ వీక్షించిన అనంత‌రం ర‌క‌ర‌కాల ట్వీట్ల‌తో ఒక్క‌సారిగా వేడి పెంచాడు.

ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ ప్ర‌భాస్.. అంటూ దుబాయ్ ప్రివ్యూ రిపోర్ట్ ని అందించాడు స‌మీక్ష‌కుడు ఉమైర్ సంధు. సాహో చిత్రంలో ప్ర‌భాస్ విల‌న్ గా క‌నిపించ‌డం అన్న‌ది అతి పెద్ద మాస్ట‌ర్ స్ట్రోక్ .. యాక్ష‌న్ స‌న్నివేశాలు మ‌న‌సు దోచేస్తాయి. ప్ర‌భాస్ లా వేరొక న‌టుడు ఎవ‌రినీ అంత కూల్ గా దొంగ‌త‌నాలు చేసే పాత్ర‌లో చూడ‌లేం. ప్ర‌థ‌మార్థం మైండ్ బ్లోవింగ్!! అంటూ ట్వీట్ చేశారు. ప్ర‌భాస్ ఎంట్రీ జ‌స్ట్ పైసా వ‌సూల్.. యాక్ష‌న్ .. ఛేజెస్.. స్టంట్స్ ప్ర‌తిదీ గూస్ బంప్స్ అంటూ అంత‌కంత‌కు వేడి పెంచాశాడు త‌న ట్విట్ట‌ర్ రివ్యూల‌తో.

స్టార్ ప‌వ‌ర్, యాటిట్యూడ్ లోడ్ చేసిన సాలిడ్ ఎంట‌ర్ టైన‌ర్ `సాహో` అంటూ కితాబిచ్చేశాడు. నోరూరించే విష‌యాలెన్నో ఈ చిత్రంలో ఉన్నాయి. ఇంత‌కుముందు ఉన్న అన్ని రికార్డుల్ని బ్రేక్ చేసే అద్భుత‌మైన చిత్రమిది. ప్ర‌భాస్ మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌బోతున్నాడు! అంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. యుఏఈ సెన్సార్ బోర్డ్ రిపోర్టును అత‌డు రివీల్ చేశాడు. స్లీక్ విజువ‌ల్స్.. హై ఆక్టేన్ యాక్ష‌న్ సీన్స్ .. మెలోడియ‌స్ మ్యూజిక్ .. ఇవ‌న్నీ మ‌సాలా సినిమాల్ని ప్రేమించేవారికి పండ‌గ చేస్తాయి! ఈ వారాంతం మిమ్మిల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే అత్య‌ద్భుత‌ యాక్ష‌న్ చిత్ర‌మిది అని ప్ర‌శంస‌లు గుప్పించాడు. `సాహో`కి 4 /5 స్టార్ రేటింగ్ ని ఇచ్చాడు. అయితే ఇది ఉమైర్ సంధు వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మేనా? లేక జ‌న‌ర‌ల్ ఆడియెన్ కి ఆ స్థాయి ఫీల్ క‌లుగుతుందా.. అన్న‌ది వేచి చూడాల్సిందే.