దొరసాని చిత్రంలో వీళ్లిద్దరి కెమిస్ట్రీపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి విరుచుకుపడింది. దొరసాని సినిమాను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి సంచలన కామెంట్లు చేసింది. అయితే శ్రీరెడ్డి దొరసాని సినిమాను టార్గెట్ చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది.
ఇటీవలే డిగ్రీ కాలేజీ అనే ఓ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా జీవిత ఆ సినిమాల్లోకి అభ్యంతరకరమైన సన్నివేశాలపై మండిపడింది. బెడ్ రూంలో చేయాల్సిన పనులు రోడ్ మీద చేస్తామా అంటూ జీవిత చేసిన కామెంట్స్ ను ఇప్పుడు దొరసాని సినిమాకు వర్తింపజేసింది శ్రీరెడ్డి.
ఎందుకంటే.. దొరసాని సినిమాలో శివాత్మిక, ఆనంద్ మధ్య లిప్ లాక్ సీన్ ఉంటుందట. ఆ సీన్ పైనే విరుచుకుపడింది శ్రీరెడ్డి. జీవిత గారు నీ కూతురు దగ్గరికి వచ్చేసరికి ఎన్ని పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు. మీరెలాగూ మూవీ అసోసియేషన్ కార్డుకు అడ్డం పడుతున్నారని తెలుసు. అయినప్పటికీ మాట్లాడుతా. కిస్ అనేది బెడ్ రూంలో చేసుకునేది కాదా? రోడ్డు మీద చేసుకునేదా? నీ కూతురుకు ఒక న్యాయం.. ఇంకొకలకు ఇంకో న్యాయమా? అంటూ ఫేస్ బుక్ లైవ్ లోనూ జీవితపై విరుచుకుపడింది శ్రీరెడ్డి.