అక్కినేని నాగేశ్వర రావు ఎక్కని ఎత్తులు లేవు చేరని గమ్యాలు లేవు అంటారు . నాగేశ్వర రావు జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వున్నాయి. మానసిక సంఘర్షణలు వున్నాయి . సెప్టెంబర్ 20 1924న కృష్ణాజిల్లా రామాపురంలో జన్మించిన అక్కినేని ఇంట్లో పరిస్థితులవల్ల ఎక్కువగా చదువుకోలేక పొయ్యాడు . దుక్కిపాటి మధుసూదన రావు ప్రారంభించిన ఎక్సేల్సియర్ డ్రామా కంపెనీలో చేరి ఆడ పాత్రల్లో నటించడం మొదలు పెట్టాడు . తల్లి పున్నమ్మ అక్కినేనిని ఆడపిల్లగా అలంకరించి మురిసి పోతుండేది . ఆమెకు ఆడ పిల్లలు లేరు . అందుకే చిన్నవాడైన అక్కినేనిని గారాబంగా చూసుకునేది .
జీవితంలో ఏ ఘటన ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు . అది మంచికి దారి తీయ వచ్చు. చేదు అనుభవం కావచ్చు . అది జీవితానికి గొప్ప పునాది కావచ్చు . కాలం కలసి రాక పోతే అదే సమాధి కావచ్చు . ఎక్సేల్సియర్ కంపెనీలో వేషాలు వేయడమే అక్కినేని జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది .
నాటకం వేయి తిరిగి వెడుతూ బెజవాడ రైల్వే స్టేషన్ లో ఆగినప్పుడు ఘంటసాల బలరామయ్య గారి దృష్టి లో పడ్డాడు . అదే “సీతారామ జనం ” ఈ సినిమాలో శ్రీరాముడు పాత్ర ధరించాడు . అక్కినేని అన్న రామ బ్రహ్మం , దుక్కిపాటి మధుసూదన రావు సలహా తీసుకున్నాడు . అన్నీ ఆలోచించుకున్నాక 1944 మే వ తేదీ బయలుదేరి మే 8 వ తేదీన మద్రాస్ మహా నగరంలో తొలిసారి కాలు పెట్టాడు . ఆయన ఆయన అమృత ఘడియల్లో పాదం మోపి ఉంటాడు . అందుకే తార పథంలో ఉజ్వల తారగా ప్రకాశించాడు .