డీఎంకే నేత , మాజీ కార్పొరేటర్ సెల్వ కుమార్ వీధి రౌడీ కంటే దారుణంగా ప్రవర్తించాడు. ఓ మహిళను దారుణంగా కాలితో తన్నాడు. ఇష్టం వచ్చినట్లు ఆమె పై దాడి చేస్తూ ఆగ్రహంతో ఊగిపోయాడు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయినా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ నేత ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు.