గుబులు గుబులు గా ఉంద‌న్న సీకే బ్యూటీ

బ్రేక‌ప్ డార్లింగ్‌తో అన్నను క‌లుపుతున్న చెల్లెలు

లాక్ డౌన్ వేళ భామలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కొంద‌రూ పూర్తిగా వంట గ‌దికి ప‌రిమిత‌మైతే..మ‌రికొంత యోగాస‌నాలు వేస్తూ గ్లామ‌ర్ ఎలివేష‌న్ ప‌నిలో ఉన్నారు. ఇక సోష‌ల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫోటోల‌తో అభిమానుల‌కు ట‌చ్ లో ఉండే వారంతా! అదే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. తాజాగా `లోఫ‌ర్` బ్యూటీ దిశా ప‌టానీ కూడా అందాల్ని ఫోక‌స్ చేసే ప‌ని పెట్టుకుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు ఇన్ స్టాలో ఓ హాట్ ఫోటోని అప్ లోడ్ చేసి కుర్ర కారుని ఊపేస్తోంది. మండే ఎండ‌లు…ఏకాంతం..కోవిడ్-19 భ‌యం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలో !ఏమో గుబులు గుబులు గా ఉందన్న హాట్ ఫోటోని షేర్ చేసింది.

ఎద అందాల్ని..థై అందాన్ని ఎలివేట్ చేస్తూ ఇలా కెమెరాకి చిక్కింది. ప్రస్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. నేటి జ‌నులు ర‌క‌ర‌కాల కామెంట్ల‌తో ఫోటోని మ‌రింత హీటెక్కిస్తున్నారు. ఇక అమ్మ‌డి ప్రోఫెష‌న‌ల్ కెరీర్ విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ లో రెండు ప్రాజెక్ట్ లతో బిజీగానే ఉంది. స‌ల్మాన్ ఖాన్ హీరోగా ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలోతెర‌కెక్కుతోన్న‌ బాలీవుడ్ లో రాధే లోన‌టిస్తోంది. అలాగే మ‌రో ప్రాజెక్ట్ తోనూ బిజీగా ఉంది. తెలుగులో లోఫ‌ర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమా విజ‌యం సాధించ‌క‌పోవ‌డం ఇక్క‌డ అవ‌కాశాలు రాక బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్క‌డ బాఘీ తో మంచి స‌క్సెస్ రావ‌డంతో స్టార్ హీరోల చిత్రాల్లో అవ‌కాశాలు అందుకుంటోంది.