స్విట్జర్లాండ్ కు డిస్కో రాజా

డిస్కోరాజా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ను ఢిల్లీ ప్రారంభించ‌నుంది. ఈ షెడ్యూల్ ఆగ‌స్ట్ 4 నుండి ప్రారంభం కానుంది. కాగా. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే త‌దుప‌రి షెడ్యూల్ స్విజ‌ర్లాండ్‌లో ప్రారంభం అవుతుంది. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేశ్‌, తాన్యా హోప్ న‌టిస్తున్నారు. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రం త‌ర్వాత ర‌వితేజ హీరోగా రూపొందుతోన్న చిత్ర‌మిది.