ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళంలో సంభవించిన తిత్లీ తుఫాను అతలాకుతలం చేసి తీవ్ర నష్టాన్ని కలిగించిన విషయం తెల్సిందే. ఇలాంటి ఆపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు చిత్రపరిశ్రమ నుండి తక్షణ స్పందన వస్తుందన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఈ విపత్తు పై స్పందించిన కొందరు సినీ ప్రముఖులు ఇప్పటికే తమ విరాళాలు ప్రకటించటం జరిగింది.
ఈ నేపథ్యంలో మా “తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం” కూడా స్పందిస్తూ తిత్లీ తుఫాను సహాయ నిధికి రూ. ఒక లక్ష రూపాయల విరాళాన్ని అందజేస్తున్నాం. ఈ మేరకు నిన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధ్యక్షుడు శంకర్ , కార్యదర్శి రామ్ ప్రసాద్ తెలిపారు. అసోసియేషన్ సభ్యులు కొందరు వ్యక్తిగత హోదాలో కూడా విరాళాలు ఇస్తామని హామీ ఇచ్చిన మీదట అవి కూడా వసూలు చేసి ఒకే మొత్తంగా తుఫాను బాధితుల సహాయనిధికి కోసం ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడుకు అందజేస్తామని వీరు తెలిపారు .