ప్రపంచాన్ని కరోనా బెంబేలెత్తిస్తోంది. వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆశాజనకమైన ఫలితాలు వస్తున్నాయి. కానీ మనుషులపై ప్రయోగం అనంతరం ఎంత ఫలిస్తాయి అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అందుకు ఇంకొన్ని నెలలు సమయం పడుతుంది. ఈనేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ వి. వి.వినాయక్ డాక్టర్లకు ఓ సలహా ఇచ్చారు. అదేంటంటే? వినాయక్ ఓ సారి ఆఫ్రికాలోని కెన్యాకు వెళ్లారుట. అక్కడికి వెళ్లాలంటే ఎల్లో ఫీవర్ నివారించే ఇంజెక్షన్ తప్పనిసరిగా వేసుకోవాలంట. ఆ ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత కెన్యా ప్రయాణినికి అనుమతిస్తారుట. ఈ ఎక్స్ పీరియన్స్ తనకు ఉందని వినాయక్ తెలిపాడు.
అయితే ఆ సమయంలో ఎల్లో ఫీవర్ గురించి అక్కడి డాక్టర్లను వినాయక్ అడిగారుట. ప్రస్తుతం కరోనా లక్షణాలు వేటినైతే చెబుతున్నారో( దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు) సరిగ్గా ఇవే లక్షణాలు ఎల్లో ఫీవర్ కు ఉన్నాయని డాక్టర్ చెప్పారుట. కాబట్టి ఆ ఇంజెక్షన్ కరోనాకి కూడా పనిచేస్తుందేమోనని వినాయక్ అనుమానం వ్యక్తం చేసారు. ఇటీవల కరోనా గురించి అద్భుతంగా వివరించిన ఇద్దరు వైద్యులకు తన ఈ సూచన చేరాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేసానన్నారు. ఈ వీడియో ఆ డాక్టర్లకు చేరేలే షేర్ చేయండని కోరారు. అయితే ఇది కేవలం తన సలహా మాత్రమేనని..అన్ని రకాలు గా డాక్టర్లు గానీ, పేషెంట్లు గానీ నిర్ధారించుకున్న తర్వాత ఈ ఇంజెక్షన్ వేసుకోవాలని సూచించారు.
అయితే ఈ ఇంజెక్షన్ ఇక్కడ దొరకదని ఆఫ్రికా దేశాల్లో మాత్రమే దొరుకుతుందన్నారు. దానిపై మన డాక్టర్లు కూడా సీరియస్ గా ఆలోచిస్తే బాగుంటుందని సూచించారు. ఇది కేవలం సమాచారం మాత్రమేనని తప్పుగా ఎవరూ అనుకోవద్దన్నారు. తనకు తెలిసిన విషయాన్ని మాత్రమే చెప్పానన్నారు. కొన్ని కొన్నిసార్లు చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికుతాం. మన పక్కనే ఉన్నది అన్న విషయాన్ని గ్రహించలేం. అందుకే ఈ విషయాన్ని అందరితో పంచుకున్నట్లు వినాయక్ తెలిపారు. వినాయక్ చెప్పింది నిజమే. ఏ పుట్టలో ఏముంటుందో ఎవరికి తెలుసు. వైరస్ లు ఎలా పుడతాయో తెలియదు. కానీ మనుషుల మీద ఎలా దాడిచేస్తాయో తెలిసిందే.