యూత్ ను  ఆకట్టుకున్న “ప్రేమకు రెయిన్ చెక్” 

కొత్త తరహా కాన్సెప్ట్ , కంటెంట్ కొసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కొసమె అన్నట్టు ఈ వారం విడుదలైంది ” ప్రేమకు రెయిన్ చెక్  “.  ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం “ప్రేమకు రెయిన్ చెక్”.ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్ స్టార్ ఎంటర్ టైనెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పించారనగానే ఆడియెన్స్ లో ఓ అటెన్షన్ ఈ చిత్రం పై ఏర్పడింది.అభిలాష్ వాడడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం  సెప్టెంబరు 7 న విడుదలై యూత్ ను ఆకట్టుకుంటోంది‌. ఇప్పటివరకు ఎన్నో ప్రేమ‌కధలను తెలుగువారు చూసుంటారు కానీ, తొలిసారి ఓ ఎడ్వెంచరెస్ లవ్ స్టొరీతో దర్శకుడు ఆకెళ్ల ఓ ఫ్రెష్ ఫీల్ ను ప్రేక్షకులకు అందించారన్న ఫీడ్ బ్యాక్ లభించింది. నటీనటులు కొత్తవారైనా , టెక్నికల్ టీమ్ సపొర్ట్ తో ఆకెళ్ల పేరి శ్రీనివాస్ ఓ వండర్ ఫుల్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారన్న కామెంట్స్ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి వినిపించటం విశేషం.విడుదలకు ముందే హాలీవుడ్ నిర్మాతల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావటంతో పాటు , ఇప్పుడు కామన్ ఆడియెన్స్ కూడా ఈ కంటెంట్ కనెక్ట్ కావటం పట్ల దర్శకుడిగా ఆకెళ్ల  పేరి శ్రీనివాస్  ఆనందాన్ని వ్యక్తం చెస్తున్నారు.‌  

 

అభిలాష్ వాడడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం, రఘు కారుమంచి, కిరీటి దామరాజు, కల్కీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దీపక్ కిరణ్, ఛాయాగ్రహణం: శరత్ గురువుగారి. సమర్పణ: నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్, రచన-దర్శకత్వం: ఆకెళ్ళ పేరి శ్రీనివాస్.