(ధ్యాన్)
తక్కువ ఖర్చులో ఎక్కువ క్వాలిటీతో సినిమా చేస్తేనే.. నిర్మాత రూపాయి లాభాన్ని చూసే అవకాశాలున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు ఎలాగూ భారీ బడ్జెట్‌లు తప్పవు. అయితే వారికి ఉన్న అభిమాన గణంతో పెట్టిన బడ్జెట్ వెనక్కు వచ్చేస్తుంది. అయితే మీడియం బడ్జెట్ హీరోలు… స్మాల్ బడ్జెట్ హీరోలు మాత్రం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ప్రాజెక్ట్‌కు నష్టాలు తప్పవు. ఇప్పుడు ఓ దర్శకుడు చేస్తున్న నిర్వాకం కారణంగా.. నిర్మాతకు చుక్కలు కనపడుతుందట. ఇంతకు నిర్మాతకు చుక్కలు చూపిస్తున్న దర్శకుడెవరో తెలుసా? హను రాఘవపూడి. ఈ దర్శకుడు ప్రస్తుతం శర్వానంద్‌తో పడి పడి లేచె మనసు సినిమా డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ సినిమాను డైరెక్ట్ చేసే సమయంలో పది హేను కోట్ల బడ్జెట్‌లోపే పూర్తి చేసేస్తానని నిర్మాతలో అన్నాడు. సరే శర్వానంద్ హీరో కదా! సినిమా బావుంటే సినిమా 30-35 కోట్ల రూపాయలు వసూలవుతాయి. పదిహేను కోట్లే కదా! అనుకున్నాడు. అయితే సినిమాలోని దిగిన తర్వాత బడ్జెట్ మూడింతలు అవుతుంది. ఆరు నెలల్లో పూర్తి అవుతుందనుకున్న సినిమా పూర్తి చేయకపోవడం.. ఇప్పటికే సినిమాకు 38 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందట. మరో ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఓ పక్క నిర్మాతకు ఏం చేయాలో పాలు పోవడం లేదట. శర్వానంద్ లాంటి హీరో పై దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టడం అంటే మాటలు కావు.. ఇప్పుడు సగంలో సినిమాను వదులుకోలేరు. ఓ రకంగా నిర్మాత మింగలేక .. కక్కలేక ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాడని వినికిడి.