అల.. హిందీ రీమేక్ హీరో ఎవ‌రో తెలుసా?

తెలుగు సినిమాల‌కు హిందీ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్లు హిందీలో రీమేక్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ క‌బీర్ సింగ్ సంచ‌ల‌నాల నేప‌థ్యంలో సౌత్ సినిమా గిరాకీ అంత‌కంత‌కు పెరుగుతూనే ఉంది. ప్ర‌స్తుతం జెర్సీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. కాంచ‌న లాంటి హార‌ర్ చిత్రం హిందీ ప‌రిశ్ర‌మ‌కు వెళుతోంది.

ఇప్పుడు సంక్రాంతి 2020 బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `అల వైకుంఠ‌పుర‌ములో` హిందీలో రీమేక‌వుతోంది. ఈ సినిమా రైట్స్ ని అశ్విన్ వార్దేకు క‌ట్ట బెట్టార‌ని తెలుస్తోంది. భారీ పోటీలో ఫ్యాన్సీ ధ‌ర‌..చెల్లించి ఆయ‌న హ‌క్కులు ద‌క్కించుకున్నారు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ త‌ర్వాత మ‌రో క్రేజీ రీమేక్ వీళ్ల‌కే ద‌క్క‌డం పై టాలీవుడ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అన్న‌ట్టు హిందీ రీమేక్ లో క‌థానాయ‌కుడిగా ఎవ‌రు న‌టిస్తారు? అంటే బ‌న్ని త‌ర్వాత అంత‌టి ఎన‌ర్జీ ఉన్న స్టార్ల‌నే వెతుకుతున్నార‌ట షాహిద్ లేదా అక్ష‌య్ తో ప్లానింగ్ సాగుతోంద‌ని తెలుస్తోంది. క‌బీర్ సింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డంతో షాహిద్ మార్కెట్ రేంజు అమాంతం పెరిగింది. ఈ నేప‌థ్యంలో అత‌డినే ఫైన‌ల్ చేసే వీలుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.