బుల్లితెర మీద ప్రసారం రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ఓటిటీలో ప్రసారమవుతోంది. ఇదిలా ఉండగా ఇద్దరు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఒక అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. యూట్యూబ్ వెబ్ సీరీస్, షార్ట్ ఫిలిమ్స్, సీరియల్స్ ద్వార తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న సిరి హనుమంత్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో చేసిన పార్టిసిపేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. బిగ్ బాస్ ద్వారా సిరి ఇమేజ్ మరింత పెరిగింది. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు పొందిన వారిలో రేష్మా పసుపులేటి కూడ ఒకరు.
రేష్మ కూడా వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ క్రమంలో ఆమెకు బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా రేష్మ కూడా మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ బిగ్ బాస్ బ్యూటీస్ ఇద్దరు ఒక అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు.హిందీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొన్న అడల్టింగ్ అనే వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా బీఎఫ్ఎఫ్ గా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ లో నటించే అవకాశం ఈ ఇద్దరికీ దక్కింది.
హిందీలో బాగా పాపులర్ అయిన అడల్టింగ్ అనే వెబ్ సిరిస్ లో విరాజ్ గెహ్లానీ,అయేషా ఆహ్మద్, యశష్మిని దయానా వంటి వారు కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ వెబ్ సీరీస్ ని తెలుగులో బీఎఫ్ఎఫ్ గా రీమేక్ చేస్తున్నారు.ఇందులో సిరి హనుమంత్, రేష్మా పసుపులేటి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ బీఎఫ్ఎఫ్ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్స్ మీట్ లో బీఎఫ్ఎఫ్ టీం మొత్తం పాల్గొని చాలా సందడి చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ ” ఎవరి మీద ఆధారపడకుండా స్వాతంత్ర భావాలు కలిగిన ఇద్దరు యువతుల జీవితం జరిగే సంఘటనల గురించి ఈ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంది. ప్రస్తుత కాలంలో యువతరానికి అద్దం పట్టేలా ఉండే ఈ వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది” అని ఆయన చెప్పుకొచ్చారు. .