Home Tollywood రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు క‌రోనా పాజిటివ్!‌

రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు క‌రోనా పాజిటివ్!‌

                                      బ్రూస్లీ లాంటి ఆర్జీవీకి ఘోర‌ అవ‌మానం

“ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ జ్వరంతో బాధపడుతున్నారు. ఆయ‌న స‌న్నిహితుల‌కు జ్వ‌రం వ‌చ్చింది. కోవిడ్ -19 లక్షణాలేమోన‌ని అనుమానం వ‌చ్చి ఆస్ప‌త్రిలో ప‌రీక్షించుకున్నారు. అయితే వీరికి కరోనా నెగెటివ్ అని వ‌చ్చింది. ఇది కేవ‌లం వైరల్ జ్వరం మాత్ర‌మేన‌ని వైద్యులు నిర్ధారించారు. ఆయ‌న విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది“ అంటూ సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారం హీట్ పెంచిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇదేదీ ప‌ట్ట‌ని వ‌ర్మ‌ తన తాజా చిత్రం `డేంజరస్` కొత్త పోస్టర్‌ను విడుద‌ల చేసి త‌న‌దైన శైలిలో ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టాడు. ఇది తెలుగులో మొదటి లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ అంటూ ఒక‌టే ఊద‌ర‌గొట్టేస్తున్నాడు. మ‌రోవైపు విచ్చ‌ల‌విడిత‌నాన్ని ప్రేరేపిస్తున్న ఈ దారుణ చిత్రాన్ని ఆపాలంటూ ప‌లువు‌రు కోర్టుల ప‌రిధిలో పోరాటం సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే.

వ‌రుస సినిమాల‌తో హ‌డావుడిగా ఉన్న ఆర్జీవీపై ఊహించ‌ని ప్ర‌చారం మొద‌లైంది. దీనికి ఆయ‌న ఇచ్చిన స‌మాదానం ఆస‌క్తిక‌రం. త‌న‌కు క‌రోనా అంటూ సాగించిన ప్ర‌చారాన్ని ఆర్జీవీ త‌న‌దైన శైలిలో ఖండించారు. తాజాగా ట్విట్ట‌ర్ లో ఆర్జీవీ ఓ వీడియోని షేర్ చేశారు. నాకు తీవ్ర జ్వ‌రం వ‌చ్చింద‌ని రాశారు. అది కోవిడ్ 19 లేదా వేరే ఇంకేదైనా అన్న‌ది నాకు తెలీదు. నేను ఆరోగ్యంగానే ఉన్నా. నాన్ స్టాప్ గా ప‌ని చేస్తున్నా. మిమ్మ‌ల్ని నిరాశ‌పరిచినందుకు సారీ..“ అంటూ ఆ వీడియోలో తన‌పై సాగుతున్న ప్ర‌చారాన్ని ఖండించారు.

ఆర్జీవీ వ‌రుస‌ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైర‌స్, థ్రిల్ల‌ర్, మ‌ర్డ‌ర్, అల్లు, దిశా, 12 ఓ క్లాక్ .. ఇలా ప‌లు జోన‌ర్ల‌ను ట‌చ్ చేస్తూ విభిన్న‌మైన సినిమాల్ని తీస్తున్నారు. ఇవ‌న్నీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. ప‌లు సినిమాల్ని ఆపాలంటూ కోర్టుల్లో గొడ‌వ న‌డుస్తోంది. ఈలోగానే ఆర్జీవీ కోవిడ్ 19 సోకింద‌న్న ప్ర‌చారంతో ఆయ‌న నేరుగా ట్విట్టర్ లోకి వ‌చ్చి ఆ వార్త‌ల్ని ఖండించారు. బ‌రువైన డంబెల్ ఎత్తుతూ బ్రూస్లీనే త‌ల‌పిస్తున్నాడు ఆర్జీవీ. అలాంటి వీరుడిపై ఈ దుష్ప్ర‌చార‌మేమిటో?

 

- Advertisement -

Related Posts

‘అదిరింది’కి కాలం చెల్లింది.. అందుకే చమ్మక్ చంద్ర అక్కడికి జంప్

జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర తిరుగులేని స్టార్డం. చమ్మక్ చంద్ర స్కిట్లను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేసేలానే ఉంటాయి. ఎందుకంటే చమ్మక్ చంద్ర తీసుకునే పాయింట్ మొగుడు పెళ్లాం. ప్రతీ ఇంట్లో ఉండే...

బంగారు బుల్లోడు రివ్యూ: రొటీన్ ట్రాక్‌లో వెళ్లిన అల్ల‌రోడు..ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం

చిత్ర టైటిల్‌ : బంగారు బుల్లోడు నటీనటులు : అల్లరి నరేశ్‌, పూజా జవేరి, తనికెళ్ల భరణి, పొసాని కృష్ణ మరళి, అజయ్ ఘోష్, పృథ్వీ, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను,తదితరులు నిర్మాణ సంస్థ :...

ప్రభాస్ స్కై-ఫై.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక స్కై ఫై సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు....

మాస్టర్ ఎఫెక్ట్.. రేటు పెంచిన సేతుపతి

మాస్టర్ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా నెగిటివ్ రోల్ లో నటించిన విజయ్ సేతుపతి మళ్ళీ రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు టాక్ వస్తోంది. 96 హిట్టుతో హీరోగా ఏ రేంజ్ లో క్లిక్కయ్యాడో అందరికి తెలిసిందే. అయినా కూడా కేవలం...

Latest News