ఆనారోగ్యంతో దేవదాసు కనకాల మృతి

ఆనారోగ్యంతో దేవదాసు కనకాల మృతి

ప్రముఖ నటుడు , నిర్మాత , దర్శకుడు దేవదాసు కనకాల కొద్దిసేపటిక్రితం కన్నుమూశారు . ఆయన వయసు 74 సంవత్సరాలు . ఆయన భార్య లక్ష్మీదేవి కొన్నాళ్ల క్రితం మరణించారు . ఆయనకు ఒక కుమారుడు రాజీవ్ కుమార్తె శ్రీలక్ష్మి వున్నారు . రాజీవ్ భార్య సుమ శ్రీలక్ష్మి భర్త రామారావు . దేవదాసు కనకాల మద్రాస్ ఫిలిం ఇన్ స్టిట్యూట్ ద్వారా ఎందరో నటీనటులకు శిక్షణ ఇచ్చారు . దేవదాసు ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించారు . కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు .

దేవదాసు జులై 30 ,1945లో యానంలో జన్మించారు . విద్యాభాసం అంతరం భార్య లక్ష్మి దేవితో కలసి మద్రాస్ లోని అడయార్ లో వున్న యాక్టింగ్ స్కూల్లో చేరారు . చిరంజీవి , రజనీకాంత్ , రాజేంద్ర ప్రసాద్ తదితరులకు భార్యా భర్తలు ఇద్దరు శిక్షణ ఇచ్చారు . దేవదాసు మరోవైపు ఓ సీత కథ, మాంగల్యానికి మరో ముడి , సిరిసిరి మువ్వ ,గోరింటాకు ,భలే దంపతులు ,చెట్టుక్రింద ప్లీడరు , గ్యాంగ్ లీడర్ , ఆమ్మో ఒకటో తారీకు , మనసంతా నువ్వే , ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రాల్లో నటించాడు . అమృతం టీవీ సీరియల్ లో కూడా నటించాడు . మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన దేవదాసు దంపతులు యాకింగ్ స్కూల్ పెట్టి ఎందరో యువ నటీనటులకు తర్ఫీదు ఇచ్చారు .

ఇటీవల అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చేరిన దేవదాసు కోలుకోకుండానే ఈరోజు సాయంత్రం కన్ను మూశారు . దేవదాసు మృతికి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు తో పాటు పలువురు సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు .