కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎం.పూర్ణానంద్ దర్శకత్వంలొ తెరకెక్కుతోన్న చిత్రం “దీర్ఘఆయుష్మాన్ భవ”. డా.ఎం.వి.కె.రెడ్డి సమర్పణలో ప్రతిమ.జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వినాయకచవితి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా
దర్శకుడు ఎం.పూర్ణానంద్ మాట్లాడుతూ – ” చాలా రొజుల తర్వాత కైకాల సత్యనారాయణ గారు యముడుగా ఈ చిత్రంలొ అలరించనున్నారు. వినాయకచవితి సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నాము. చిత్రీకరణ పూర్తయింది. గ్రాఫిక్స్ కు ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ చివరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.
కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి, ఆమని, పృథ్వీరాజ్, జెమినిసురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్, కెమెరా: మల్హర్‌భట్ జోషి, మాటలు: ప్రదీప్ ఆచార్య, పూర్ణానంద్.ఎం, ఆర్ట్: రామకృష్ణ, నిర్మాత: ప్రతిమ.జి, కథ, కథనం, దర్శకత్వం: పూర్ణానంద్.ఎం.