టాలీవుడ్ లో ఏలియన్స్ సంచారం!
ప్రమాదంలో తెలుగు సినిమా.. ప్రిడేటర్స్ వర్సెస్ ఏలియన్స్ గేమ్!
టాలీవుడ్ లో ప్రిడేటర్స్ సంచారమా? ఏలియన్స్ వీరవిహారమా? అయితే అదేంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ ప్రిడేటర్ కం ఏలియన్ వ్యవస్థ గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని తెలుసుకుని తీరాలి. ఈ ప్రిడేటర్స్ పైకి కనిపించని ప్రమాదకర రక్కసులు. ఇవి మనిషి రూపంలో ఉండే ప్రిడేటర్స్. నిరంతరం నిర్మాతల చుట్టూ తిరుగుతుంటాయి. కల్లబొల్లి కబుర్లు చెబుతుంటాయి. సందు చూసి ఉచ్చులోకి లాగే ప్రిడేటర్స్ ఇవి. డబ్బు కోసం ఎలాంటి మోసానికి అయినా దారుణాలకు అయినా తెగబడే ప్రమాదకర జీవులు అంటే తప్పేం కాదు. ముఖ్యంగా పరిశ్రమలో ఎందరికో అన్నం పెట్టే.. ఉపాధినిచ్చే నిర్మాతల్ని ఎలా మోసం చేయాలి? మీడియా మధ్యవర్తిత్వం పేరుతో డబ్బు కొట్టేయడమెలా? అన్న తపనతో ఇక్కడ ఏలియన్స్ నిరంతరం నిర్మాతల చుట్టూ చక్కర్లు కొడుతుంటాయి. ఫిలింనగర్ – కృష్ణానగర్ లో అడుగుపెట్టే ఎందరో నిర్మాతలు ఈ ప్రిడేటర్స్ ఏలియన్స్ వల్ల బలి క్రతువుకు సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.
ముందుగా ఈ ప్రిడేటర్స్ లక్షణాలు కొన్నిటి గురించి తెలుసుకోవాలి. ఈ ప్రిడేటర్స్ లో పబ్లిసిటీ పేరుతో చెలరేగే ఏలియన్ కేటగిరీ కూడా ఉన్నాయి. మీకు ఉచితంగా ప్రచారం చేసి పెడతాం. మీడియా మొత్తం మా దగ్గర చెంచా గిరి చేస్తుంటుంది! అన్నది ప్రిడేటర్స్ విసిరే మొదటి ఎర. ఒకసారి పెట్టుబడి దారు లేదా నిర్మాతను ముగ్గులోకి దించి ఆ తర్వాత తెలివిగా మోసాలకు తెరతీయడం ఈ ప్రిడేటర్స్ పని. అయితే ఈ తరహా మోసాలు పలు కోణాల్లో సాగుతుంటాయి. అంతేకాదు ఈ ప్రిడేటర్స్ దెబ్బకు అటు నిర్మాతల జేబు ఖాళీ. ఇటు జర్నలిజాన్ని నమ్ముకునే వాళ్లకు కనీస ఉపాధి లేని పరిస్థితి ఉంటుంది. దళారీ వ్యవస్థ ఉన్న ప్రతిచోటా ఉండే సమస్యనే ఇది. ఈ తరహా ప్రిడేటర్స్ ప్రతి వ్యవస్థలోనూ కనిపిస్తుంటారు. ఇక టాలీవుడ్ లో ఈ ప్రిడేటర్స్ మరింత ప్రమాదకరంగా జుగుప్సాకరమైన డబుల్ గేమ్ ఆడుతూ కనిపిస్తుంటాయి. ఇంకా ఈ ప్రిడేటర్స్ మోసాల గురించి తదుపరి ఆర్టికల్స్ లో విఫులంగా తెలుసుకుందాం.
<
p style=”text-align: justify”>దాదాపు ఎనిమిది దశాబ్ధాల సుదీర్ఘ చరిత్ర ఉన్న టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రిడేటర్ గేమ్ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇందులో కులం అనే అవ్యవస్థ ఒక పెను ప్రమాదకర సంకేతం అనే చెప్పాలి. కేవలం ఒక కులం అండతో ఈ ప్రిడేటర్స్ ఆడుతున్న ఆటపై జర్నలిస్టుల్లోనూ నిరంతరం ఆసక్తికర చర్చ సాగుతుంటుంది. ఇక ఈ ప్రిడేటర్స్ ఆడే ఆటలో నిర్మాతలు సినిమా పబ్లిసిటీ పేరుతో లక్షల్లో నష్టపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ తరహా ప్రిడేటర్ వ్యవస్థపై కోలీవుడ్ లో నిర్మాతలు యుద్ధం ప్రారంభించారు. అయితే అది టాలీవుడ్ కి విస్తరిస్తుందా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. దళారీ ప్రిడేటర్ వ్యవస్థను తొలగించాలంటే తప్పనిసరిగా ఈ విషయాన్ని నిర్మాతలు సీరియస్ గా ఆలోచించాల్సి ఉంటుంది. ఇక టాలీవుడ్ నుంచి ఈ ప్రిడేటర్ వ్యవస్థను నామరూపాల్లేకుండా చేయకపోతే ఏం జరుగుతోందో.. భవిష్యత్ ఎలా ఉండబోతోందో మునుముందు రకరకాల ఆర్టికల్స్ చదివి తెలుసుకుందాం. తాజా సమాచారం ప్రకారం.. తెలుగు సినీపరిశ్రమలో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు పలువురు అగ్ర నిర్మాతలు ఓ కొత్త పరిష్కార మార్గాన్ని వెతుకుతున్నారన్న సమాచారం అందుతోంది. మునుముందు ఈ ప్రిడేటర్ వ్యవస్థపైనా.. కవర్
ఫార్మాల్టీ పేరుతో మధ్యవర్తి ప్రిడేటర్ ఆడుతున్న నాటకాలకు చెక్ పెట్టే ప్రయత్నం సాగనుందట. టాలీవుడ్ లో అన్ వాంటెడ్ సిట్యుయేషన్ గురించి… వ్యవస్థలో లోపాల్ని క్యాష్ చేసుకునే రకరకాల దళారీ వ్యవస్థల గురించి.. మధ్యవర్తి లేదా దళారీ ప్రిడేటర్ వ్యవస్థల గురించి మరింత డీటెయిల్డ్ గా చర్చిద్దాం. మునుముందు ప్రిడేటర్ అవ్యవస్థపై మరిన్ని ఆసక్తికర విషయాల్ని తదుపరి ఆర్టికల్స్ లో తెలుసుకుందాం.