టాలీవుడ్ హంక్ రానా తన లేడీ లవ్ మిహీకా బజాజ్ ని పెళ్లాడేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి సడెన్ గా సోషల్ మీడియా ద్వారా మిహీకను పరిచయం చేశాడు. త్వరలోనే నిశ్చితార్థం సహా ఇతర వివరాల్ని వెల్లడించేందుకు దగ్గుబాటి ఫ్యామిలీ సిద్ధమవుతోంది. ఇప్పటికే సెలబ్రిటీ విషెస్ హోరెత్తాయి. సోషల్ మీడియా షేకైంది. అదంతా సరే కానీ.. రానా సీక్రెట్ గాళ్ ఫ్రెండ్ మిహీక నేపథ్యం ఏమిటి? మిహీక ఏం చేస్తుంటుంది? కుటుంబ నేపథ్యం ఏమిటి? అంటే… పలు ఆసక్తికర విషయాలే తెలిశాయి.
మిహీక హైదరాబాద్ కి చెందిన ప్రముఖ డిజైనర్ ఫ్యామిలీలో జన్మించింది. తన తల్లి బంటీ హైదరాబాద్ లో పాపులర్ డిజైనర్.. కార్పొరెట్ కంపెనీ యజమాని. బంటీ- సురేష్ బజాజ్ ల గారాల కూతురు. మిహీకా చెల్సియా విశ్వవిద్యాలయం నుండి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఇంటీరియర్ డిజైనింగ్.. డెకార్ బిజినెస్ లో ఇప్పటికే బోలెడంత అనుభవం ఘడించారు. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియోను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. సెలబ్రిటీ పెళ్లిళ్లు సహా పలు శుభకార్యాలకు డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.
మిహీక అభిరుచుల్ని పరిశీలిస్తే .. తనకు డిజైనింగ్ వృత్తి పట్ల నిబద్ధత ఎంతో. అందుకోసం దేశ విదేశాల్లో ప్రముఖ నగరాల్ని విజిట్ చేయడం అక్కడ డిజైనింగ్ సంపదను పరిశీలించడం హ్యాబిట్. అత్యంత ప్రాచీనమైన డిజైనింగ్ ఆకృతుల్ని సేకరిస్తుంటారు. ఈ అలవాటు తన తల్లి నుంచి వచ్చినదేనని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చెల్సియా విశ్వవిద్యాలయం నుండి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పుచ్చుకున్న అనంతరం ఈవెంట్ డెకర్ వైపు ఆలోచించారట.
మిహీక మామ్ బంటీ ప్రముఖ జువెలరీ బ్రాండ్ క్రిసాలా ఆభరణాల డైరెక్టర్ & క్రియేటివ్ హెడ్ గా కొనసాగుతున్నారు. క్రిసాలా బ్రాండ్ ఇప్పటికే దేశవ్యాప్తంగా పాపులర్. అన్ని మెట్రో నగరాల్లోనూ షోరూమ్స్ ఉన్నాయి. అలాగే డ్యూడ్రాప్ డిజైన్ స్టూడియో హైదరాబాద్ లో అంతే పాపులర్. ఈ స్టూడియోని ప్రారంభించేందుకు కారణం తన తల్లిగారేనని తన అండదండలతోనే ఈ బిజినెస్ రంగంలో రాణించానని మిహీక చెబుతున్నారు. ఇక వంట చేయడం అన్నా మంచి ఆహారం లాగించేయడ అన్నా తనకు ఎంతో ఇష్టమని మిహీక చెబుతోంది. థ్యాంక్ గాడ్.. రానా ఇక భర్యామణి చేతి వంటల్ని.. జీవితాంతం వెరైటీ రుచుల్ని కూడా ఆస్వాధించవచ్చన్నమాట.