రానా-మిహీక హనీమూన్ పిక్.. బీచ్‌లో అలా ఎంజాయ్ చేస్తున్నారు!!

దగ్గుబాటి రానా తన ప్రేయసి మిహీకాను ఏరికోరి మరి పెళ్లి చేసుకున్నారు. తను యస్ చెప్పిందంటూ.. లవ్ ఓకే అయిందని లాక్ డౌన్‌లో ప్రకటించాడు. ఇక రానా పెళ్లికి అన్ని మార్గాలు సుగమమం అయ్యాయని అందరూ అనుకున్నారు. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో టాప్ 2లో ఉండే రానా అలా తన ప్రేయసిని పరిచయం చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఆగస్ట్‌లో వివాహామాడి ప్రేయసిని భార్యగా మార్చుకున్నాడు.

Miheeka Bajaj Shared Honeymoon Pic
Miheeka Bajaj Shared Honeymoon Pic

ఆగస్ట్ 8న దగ్గుబాటి ఫ్యామిలీ సమక్షంలో రానా మిహీకల వివాహాం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడకను టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ ఇంటి పట్టునే ఉండి వర్చువల్‌ టెక్నాలజీతో చూశారు. ఇది రానా పెళ్లిలో కొత్తగా వాడిన సాంకేతికత. దీంతో ఇంట్లోనే ఉండి రానా పెళ్లిని లైవ్‌లో వీక్షించారు. అలా పెళ్లి కూడా గ్రాండ్‌గానే అయిపోయింది. ఇక ఈ కొత్తజంట విదేశాలకు చెక్కేసి ఎంజాయ్ చేయాలని అనుకుంది.

Miheeka Bajaj Shared Honeymoon Pic
Miheeka Bajaj Shared Honeymoon Pic

కానీ లాక్ డౌన్ వల్ల అంతా తారుమారైంది. ప్రస్తుతం అన్ లాక్ ప్రక్రియ జరుగుతుండటం, సాధారణ పరిస్థితులు ఏర్పడుతుండటంతో అందరూ ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. అందుకే ఈ జంట హనీమూన్ ప్లాన్ వేసింది. ఎంచక్కా ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లిపోయినట్టు కనిపిస్తోంది. తాజాగా మిహీక ఓ ఫోటోను షేర్ చేసింది. బీచ్‌లో ఇద్దరూ అలా పడుకుని ఉండగా.. సెల్ఫీ కోసం పోజిచ్చినట్టు కనిపిస్తోంది. ఇందులో మిహీక హాట్ నెస్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.