Rana Food Store: రానా ఫుడ్ స్టోర్ ధరలు.. ఒక్క కొబ్బరి బొండం రూ.1,000లు!

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, తన భార్య మిహికా బజాజ్ తో కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ ప్రత్యేకమైన ఫుడ్ స్టోర్ ప్రారంభించారు. ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా పెట్టుకుని, ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఆర్గానిక్, ఇంపోర్టెడ్ ఫుడ్ ఐటమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే, ఈ స్టోర్ లోని ధరలు సామాన్య వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ఈ స్టోర్ లో సాధారణంగా అందుబాటులో ఉండే కూరగాయలు, పండ్లు, న్యూట్రీషన్ ఉత్పత్తుల ధరలు ఆశించిన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు, కేవలం 200 గ్రాముల టమాట ధర ₹850, అంటే కేజీ టమాటా ధర ఏకంగా ₹4,250. అలాగే, ఒక కొబ్బరి బొండం ధర ₹1,000గా ఉంది. బయట వీటి ధరలు 100 రూపాయల లోపే ఉండగా, ఇక్కడ హై క్వాలిటీ కారణంగా ఇంత ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.

రానా స్టోర్ లో లభించే ఉత్పత్తులన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. మెక్సికో, నెదర్లాండ్స్, స్పెయిన్ వంటి దేశాల నుంచి కూరగాయలు, పండ్లు, స్నాక్స్, ప్రత్యేకమైన జ్యూస్ ఇక్కడ లభిస్తాయి. అరుదుగా దొరికే మష్రూమ్స్ కిలో ధర ఏకంగా ₹5 లక్షలు. ఒక గ్లాస్ చెరకు రసం కూడా ₹275 గా ఉంది. తాజాగా దర్శకుడు రాజమౌళి సతీమణి రమా రాజమౌళి ఈ స్టోర్ ను సందర్శించి, అక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేశారు.

ఇలాంటి ఖరీదైన స్టోర్ హైదరాబాద్ లో ప్రారంభం కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీలను, హై ప్రొఫైల్ వ్యక్తులను లక్ష్యంగా పెట్టుకుని రానా ఈ బిజినెస్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. కానీ, సామాన్య వినియోగదారులకు ఈ ధరలు అందనంత ఎత్తులో ఉండటంతో, ఈ స్టోర్ నిజంగానే అందరికోసం కాదని స్పష్టమవుతోంది.

సనాతన యోధుడు|| RK Roja Strong Counter To Pawan Kalyan Over Comments on Ys Jagan || AP Assembly || TR