దగ్గుబాటి సురేష్ బాబు రెండవ కుమారుడు అభిరామ్ చాలా నెలల తరువాత హైద్రాబాద్లో కనిపించాడు . తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ శుక్రవారం నాడు తన ఓటు హక్కును వినియోగించుకోవడాని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో వున్న బూత్ కు వచ్చాడు . అభిరాంను చూసి చాలామంది గుసగుసగా మాట్లాడుకోవం కనిపించింది . శ్రీరెడ్డి తో కిస్సింగ్ ఫోటోలు బయటకు రావడం దగ్గుబాటి కుటుంబం పరువు పోయిన విషయం తెలిసిందే .
ఈ విషయంలో వెంకటేష్ కూడా బాధ పడ్డాడని తెలిసింది . శ్రీరెడ్డి తో మాట్లాడి రామ్ గోపాల్ వర్మ సెటిల్ చేద్దామనుకున్నారు . అయితే శ్రీ రెడ్డి ఎక్కువ డబ్బు డిమాండ్ చేసిందని ,అందుకే సురేష్ బాబు ఒప్పుకోలేదని తెలిసింది . తన కుమారుడు అభిరామ్ హైద్రాబాద్లో ఉంటే మరింత రచ్చవుతుందని గ్రహించిన సురేష్ బాబు . అతన్ని బెంగళూరు పంపినట్టు తెలిసింది . బెంగళూరులో సురేష్ బాబు కుమార్తె మాళవిక ఉంటుంది . ఆమె అత్తగారి వూరు బెంగళూరు .
ఈరోజు అనుకోకుండా అభిరామ్ ప్రత్యక్షమయ్యాడు . అభిరామ్ అయ్యప్ప మాల ధరించాడు . దర్శకుడు రాఘవేంద్ర రావు అభిరాంను పలకరించాడు . అభిరాం మాత్రం నవ్వుతూ అందరినీ పలకరిస్తుండం విశేషం .