గాసిప్స్ : మహేష్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని దింపుతున్న జక్కన్న.?

రీసెంట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర జస్ట్ చిన్న లైన్ తోనే సెన్సేషన్ ని రేపిన భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే ఇండియాస్ టాప్ దర్శకుడు రాజమౌళి సినిమాపై అప్డేట్ అని చెప్పాలి.

ఈ సినిమా ఎలా ఉంటుంది అనే దానిపై రాజమౌళి జస్ట్ చిన్న లైన్ మాత్రమే చెప్పగా దాదాపు రెండు రోజులు పాటు పాన్ ఇండియా లెవెల్లో ఈ అప్డేట్ సోషల్ మీడియాని షేక్ చేసి పారేసింది. ఇక దీనితో ఇదిలా ఉండగా ఈ సినిమా మరో క్రేజీ గాసిప్ ఇప్పుడు సినీ వర్గాల్లో బయటకి వచ్చి వైరల్ అవుతుంది.

మరి ఈ అప్డేట్ ఏమిటంటే ఈ సినిమాలో మహేష్ బాబు కోసం అయితే రాజమౌళి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్టుగా అంటున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ కూడా మరెవరో కాదట బాలీవుడ్ సినిమా దగ్గర స్టార్ హీరోయిన్ అయినటువంటి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ దీపికా పదుకొనె అని తెలుస్తుంది.

ఇప్పటికే దీపికా ఇలాంటి ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాలకి తాను ఫస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే అని ఇండియన్ హాలీవుడ్ లెవెల్ సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు రాజమౌళి సినిమాలో అంటే వేరే లెవెల్ అని చెప్పాలి. మరి ఈ క్రేజీ గాసిప్ లో ఎంతవరకు నిజం ఉందొ చూడాలి.