HomeTollywoodమీరు చూశారా? సెల్ఫీ తీశారా?: దివ్యవాణికి అలీ కౌంటర్

మీరు చూశారా? సెల్ఫీ తీశారా?: దివ్యవాణికి అలీ కౌంటర్

ఇద్దరూ సినిమా నటులే, కానీ ఎలక్షన్స్ లో ఇద్దరూ వేర్వేరు పార్టీలను రిప్రజెంట్ చేస్తున్నారు. దాంతో ఇద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వాళ్లెవరో కాదు దివ్య భారతి, అలి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో నేతల, సినీ తారల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్.

పొలిటీషన్స్ కు తాము ఏమాత్రం తక్కువ కాదనే విధంగా సినీ నటులు కూడా తమ వంతుగా ఎన్నికల ప్రచారాన్ని రక్తికట్టిస్తున్నారు. కౌంటర్స్ విసురుతున్నారు. కామెంట్స్ ఇస్తున్నారు.

తాజాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అలీ సినీ నటి, టీడీపీ నేత దివ్యవాణికి కౌంటర్‌ వేశారు. ప్యాకేజీ తీసుకుని తాను వైఎస్సార్‌సీపీలో చేరినట్టు వ్యాఖ్యానించిన దివ్యవాణిపై ఆయన మండిపడ్డారు. ‘ప్యాకేజీ తీసుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేటప్పుడు మీరు చూశారా.. లేక సెల్ఫీ తీశారా’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘టీడీపీలో చేరినందుకు మీరెంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్తారా’ అని ఎద్దేవా చేశారు. కాగా, పెళ్లిపుస్తకం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దివ్యవాణి ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News