చలాకి చంటి’ కి యాక్సిడెంట్,లారీని గుద్దేసిన కారు

గ‌త కొద్ది రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించిన‌ హీరోలు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవటం, గాయాల‌ బారిన ప‌డ‌డం జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలా మిస్టీరియస్ గా వరస పెట్టి జరుగుతున్న ఈ ప్రమాదాలు తెలుగు సినీ అభిమానుల‌ని ఎంత‌గానో క‌ల‌వ‌రపరుస్తున్నాయి. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, వ‌రుణ్ తేజ్‌, నాగ‌శౌర్య‌, శ‌ర్వానంద్‌, సందీప్ కిష‌న్ ఇలా యువ హీరోలు షూటింగ్ లో గాయ‌ప‌డ్డారు.

తాజాగా జ‌బ‌ర్ధ‌స్ట్ న‌టుడు చ‌లాకి చంటి రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చంటికి గాయాలయ్యాయి. చంటి ప్రయాణిస్తున్న కారు .. లారీ వెనుక‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే చంటిని కోదాడ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేశారు.

అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి మెరుగ్గానే ఉంద‌ని సమాచారం. జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో చలాకీ చంటిగా పాపులర్ అయి సినిమా వేషాలు తెచ్చుకున్నారు చంటి. ఆయన త్వరగా కోలుకోవాలని తెలుగు రాజ్యం కోరుకుంటోంది.