జైపూర్ లోని ఫెయిర్ మౌంట్ హోటల్లో బాహుబలి దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కుమారుడు వివాహం పూజా ప్రసాదుతో వైభవంగా జరపడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి . నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ , ముంబై నుంచి అతిధులు రావడం మొదలైంది . అతిదులందరినీ విమాశ్రయం నుంచి ఆహ్వానిస్తున్నారు . హోటల్ కు చేరుకున్న వారు ఊహించని విధంగా రాజస్థానీ సాంప్రదాయ వాయిద్యాలతో స్వాగతం పలుకుతున్నారు .
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ , ప్రభాస్, అనుష్క , దగ్గుబాటి రానా వాయిద్యాలు అనుగుణంగా నృత్యం చేయడం ప్రధాన ఆకర్షణ గా నిలిచింది .
చాలాకాలం నుంచి సభల్లో మాట్లాడని దర్శకుడు రాఘవేంద్ర రావు ఇప్పుడు మాట్లాడుతున్నాడు . అలాంటి రాఘవేంద్ర రావు నృత్యం చెయ్యడం అందరినీ ఆశర్య పరిచింది . ఇక దగ్గుబాటి రానా ఎక్కడ ఉంటే అక్కడ హడావిడి ఉంటుంటుంది .
రానా వాయిద్యకారుల నుంచి డబ్బు తీసుకొని వాయించడం మొదలు పెట్టాడు . ఇది చూసి అనుష్క నేను మాత్రం డప్పు కొట్టలేనా అని తానూ కూడా మరో డప్పు తీసుకొని వాయించడం మొదలు పెట్టింది .
ఈరోజు రాత్రి మెహిందీ కార్యక్రమం తో పాటు సంగీత్ ఉంటుందని , ఇందులో నటి నటులంతా నృత్యం చేస్తారని తెలుస్తుంది .
రాజమౌళి కుటుంబం ,జగపతి బాబు కుటుంబంతో సినిమా రంగంలోని చాలా కుటుంబాలు సన్నిహితముగా ఉంటాయి. అందుకే ఈ వేడుక తమ ఇంట్లో జరుగుతున్నట్టు భావిస్తున్నారు .
రేపు రాత్రి కార్తికేయ , పూజా వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది . ఈ వేడుకలో 300 మంది అతిధులు పాల్గొంటారని తెలుస్తుంది .