సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ఎన్నో అనుమానులు, ఎన్నో ట్విస్టులు. ఇప్పటి వరకు ఏ వ్యక్తి మరణంపై కూడా ఇన్ని అనుమానాలు వచ్చి ఉండవు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్టార్ గా ఉన్నప్పుడు ఎవ్వరితోనూ అంతగా విభేదాలు పెట్టుకున్నది లేదు. సుశాంత్ చాలా కూల్. చాలా మెచ్యూర్డ్ పర్సన్. ఆయన మాట్లాడే తీరు కూడా చాలా పాజిటివ్ గా ఉంటుంది. అటువంటి వ్యక్తి ఇలా సూసైడ్ చేసుకోవడం అనేది ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అసలు సుశాంత్ ఆత్మహత్యే చేసుకోలేదు.. ఆయన్ను హత్య చేశారంటూ కొందరు ఆరోపించడం మొదలు పెట్టారు. దీంతో కేసు వెంటనే యూటర్న్ తీసుకుంది. ఆయన గర్ల్ ఫ్రెండే సుశాంత్ ను హత్య చేయించిందంటూ సుశాంత్ మాజీ మేనేజర్ ఆచార్య ఆరోపించాడు.
వీటన్నింటి నడుమ.. సుప్రీం కోర్టు కూడా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించింది. కనీసం ఇప్పుడైనా సుశాంత్ మరణానికి కారకులైన వాళ్లకు శిక్ష పడాలని సుశాంత్ అభిమానులు కోరుకుంటున్నారు.
సుప్రీం.. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించగానే.. సీబీఐ వెంటనే సుశాంత్ ఇంటికి వెళ్లింది. అక్కడ సుశాంత్ ఇంటి ఇరుగు పొరుగు వాళ్లతోనూ మాట్లాడింది. ఇరుగు పొరుగు వాళ్లు సీబీఐకి విస్తుపోయే నిజాలు చెప్పారు.
ఇవాళ మధ్యాహ్నమే సుశాంత్ ఇంటికి సీబీఐ అధికారులు చేరుకొని ఆయన ఇల్లు మొత్తాన్ని చెక్ చేశారు. ఆతర్వాత సుశాంత్ ఇంటి పక్కన ఉండే వాళ్లతోనూ మాట్లాడారు. ఓ మహిళను ప్రశ్నించగా.. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు అంటే జూన్ 13న రాత్రిపూట సుశాంత్ సింగ్ ఇంట్లోని లైట్లన్నీ బంద్ అయ్యాయని.. ఒక్క కిచెన్ లోని లైట్ మాత్రమే ఆన్ లో ఉందని తెలిపింది. సాధారణంగా సుశాంత్ సింగ్ రాత్రి పూట కూడా ఇంటి లైట్లను ఎప్పుడూ ఆన్ లో ఉంచుతాడని.. ఆరోజు రాత్రి మాత్రం ఎందుకు బంద్ చేశాడో అర్థం కావడం లేదని ఆమె సీబీఐ ఆఫీసర్లకు వెల్లడించింది. జూన్ 13 రాత్రి సుశాంత్ ఇంట్లో ఎటువంటి పార్టీ కూడా జరగలేదని ఆమె తెలిపింది.