ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ యాంక‌ర్ వెంట‌

ఒక్క రాత్రి..కోటి ఆదాయం!

యాంక‌ర్ వెంట ప‌డుతున్న కాస్టింగ్ డైరెక్ట‌ర్

వేడెక్కించే అందం చందం .. చ‌క్క‌ని వాగ్ధాటి .. గుబులు రేపే వ‌య్యారం ఉన్న ఓ హాట్ తెలుగు యాంక‌ర్ వెంట ఓ యంగ్ కాస్టింగ్ డైరెక్ట‌ర్ “ఛాన్సిస్తాను ప్లీజ్“ అంటూ వెంట‌ప‌డుతున్నాడ‌ట‌. అస‌లు ఆ యాంక‌ర్ ఫోన్ నంబ‌ర్ కావాలి ప్లీజ్! అంటూ అత‌గాడు తెగ ఇదైపోతూ వాట్సాప్ లో పెట్టిన వాయిస్ అన్ని గ్రూపుల్లోనూ వైర‌ల్ అవుతుండ‌డంతో ఆ టాపిక్ హాట్ హాట్ గా మారింది.

అంత‌గా ఆ కాస్టింగ్ సెల‌క్ష‌న్ కుర్రాడిని మెస్మ‌రైజ్ చేసిన ఆ యాంక‌ర్ ఎవ‌రు? అంటే .. ఇటీవ‌ల ఏ టాలీవుడ్ ఈవెంట్ చూసినా మెజారిటీ పార్ట్ ఈ అమ్మ‌డే క‌నిపిస్తోంది. త‌న‌దైన చిల్లు బుగ్గ‌ల న‌వ్వుల‌తో చిక్లెట్ క‌ళ్ల‌తో కుర్రాళ్ల గుండెల్ని చిదిమేస్తూ కంటికి కునుకు క‌రువ‌య్యేలా చేస్తోంది. ప్ర‌స్తుతం సాహో కాస్టింగ్ ఇంట‌ర్వ్యూల్ని ఇర‌గ‌దీసేస్తోంది. ముఖ్యంగా డార్లింగ్ ప్ర‌భాస్ ని ఇంట‌ర్వ్యూ చేస్తూ తెగ సిగ్గుల మొగ్గ అయిపోయింది. స‌ద‌రు యాంక‌ర‌మ్మ .. ఊ! అనాలే కానీ వ‌రుస పెట్టి డైరెక్ట‌ర్లు అంతా క్యూ క‌ట్టేయ‌డం గ్యారెంటీ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇంత‌కీ ఊ అంటుందో లేక ఊహూ! అంటుందో వేచి చూడాలి. ఈ త‌ర‌హాలోనే యాంక‌ర్ వ‌ర్ఛ‌స్సు.. మిస‌మిస‌లు న‌చ్చేస్తే క‌థానాయిక‌ల్ని చేసేందుకు కుర్ర డైరెక్ట‌ర్లు ఏమాత్రం మొహ‌మాటప‌డ‌రు. దాదాపు ప‌దేళ్ల పాటు ఎంద‌రో ద‌ర్శ‌కులు వెంట‌ప‌డిన త‌ర్వాత యాంక‌ర్ అన‌సూయ క‌థానాయిక అయ్యారు. అంత‌కుముందు మెరుపు లాంటి క్యారెక్ట‌ర్ల‌లో న‌టించి త‌న విజువ‌ల్ అప్పియ‌రెన్స్ ని చెక్ చేసుకుని అటుపై పెద్ద సినిమాల‌ ట్ర‌య‌ల్స్ లో ప‌డ్డారు. స‌ద‌రు యంగ్ హాట్ బ్యూటీ కూడా అలానే ట్రై చేస్తుందేమో చూడాలి.