ఆర్ ఆర్ ఆర్ కి పారిశ్రామిక‌వేత్త పైనాన్స్?

రామ్ చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో దాన‌య్య నిర్మాత‌గా ఆర్ ఆర్ ఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. 350 కోట్ల బ‌డ్జెట్ తో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చ‌ర‌ణ్‌-జ‌క్క‌న్న కూడా స్లీపింగ్ పార్ట‌న‌ర్ల‌గా ఉన్న‌ట్లు స‌మాచారం ఉంది. మ‌రి ఈ మొత్తం ముగ్గురు స‌ర్దుబాటు చేసుకున్నారా? లేక ముగ్గుర్ని మించిన ఓ బ‌డా బిగ్ షాట్ ఉన్నాడా? అత‌నే పైనాన్స్ చేస్తున్నాడా? అని సందేహాల నేప‌థ్యంలో ఓ బ‌డా పారిశ్రామిక వేత్త పేరు తెర‌పైకి వ‌చ్చింది. అత‌ను  ఎవ‌రో కాదు.

10 టీవీ ఛాన‌ల్ అధిప‌తి, పారిశ్రామిక వేత్త నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ సినిమాకు పైనాన్స్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. జ‌క్క‌న్న‌పై న‌మ్మ‌కంతోనే సినిమాకు అవ‌స‌ర‌మైన అమౌంట్ ను అయ‌నే స‌ర్దుబాటు చేస్తున్నారుట‌. జ‌క్క‌న్న తో ఆ విధంగా అగ్రిమెంట్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో రాజ‌మౌళి బాహుబ‌లి తెర‌కెక్కించిన‌ప్పుడు ఈనాడు అధినేత రామోజీరావు పైనాన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆర్కా మీడియాలో లో పెద్దాయ‌న కూడా పెట్టుబ‌డులు పెట్టి లాభాల్లో వాటా తీసుకున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. ఈ నేప‌థ్యంలో ఆసారి ఛాన్స్ నిమ్మ‌గ‌డ్డ‌కు ఇచ్చిన‌ట్లు ప్ర‌చారంలోకి వ‌స్తోంది. మ‌రి ఇందులో వాస్త‌వాలు తేలాల్సి ఉంది.