స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. ఇప్పటికే 200 కోట్ల క్లబ్ లో చేరినట్లు యూనిట్ పోస్టర్లు వేసి ప్రచారం చేసింది. థాంక్స్ మీట్లు…విజయోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించింది. అంతటితో సెలబ్రేషన్స్ స్టాప్ చేయలేదు. నిన్నటి రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ సక్సెస్ ని మరింత ఎంజాయ్ చేస్తామని తెలిపారు. దీనిలో భాగంగా డిస్ర్టిబ్యూటర్లు అందరికి స్పెషల్ పార్టీ ఇస్తున్నట్లు తెలిపారు.
అలాగే సినిమా ఇండస్ర్టీలో సెలబ్రిటీలను…పెద్దలను…ప్రముఖలకు…ఫిల్మ్ మీడియాకు ప్రత్యేకంగా మరో పార్టీ ఇస్తున్నట్లు స్వయంగా బన్నీ మీడియాతో తెలిపారు. అయితే తొలుత మీడియా ని ఆహ్వానిస్తున్నట్లు రివీల్ చేయలేదు. తర్వాత ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా మీరు లేకుడానా? అందరూ కలిసే ఎంజాయ్ చేద్దామని ఓపెన్ అయ్యాడు. ఈ సక్సెస్ తో ఎంతో హ్యాపీగా ఉన్నామంటే కారణం ప్రేక్షకులతో పాటు మీడియాని ఉద్దేశించాడు. అంతకు ముందు త్రివిక్రమ్ కూడా ఫిల్మ్ మీడియాని పొగిడేసాడు.