బన్నీ అక్క పాత్రలో ఈవిడేనా !

అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కోలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుందని వార్తలు వినపడ్డాయి. కాగా లేటెస్ట్ సమాచారం ప్రకారం త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌లో నివేదా బన్నీ సోదరి పాత్రలో కనపడుతుందట. హీరో పాత్రకు సమాంతర ప్రాధాన్యత ఉండే పాత్రలో ఉండే సోదరి పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను గమనించిన నివేదా పేతురాజ్ ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకుందట. హీరో సుశాంత్ జోడిగా నివేదా పేతురాజ్ కనపడనుందట. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.