`బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి` ఓటీటీ మూవీ రివ్యూ

`బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి` ఓటీటీ మూవీ రివ్యూ

సినిమా: బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి
రిలీజ్ తేదీ: 21 ఆగష్టు 2020
జోన‌ర్: ప్రేమ‌క‌థ‌

న‌టీన‌టులు: మున్నా, దృషిక చందర్, రవివర్మ, సుబ్బారావు
ద‌ర్శ‌క‌త్వం: కృష్ణ పోలూరు
నిర్మాత‌లు: పామిడిముక్కల చంద్ర కుమారి
సంగీతం: మహిరాంశ్

రేటింగ్: 1.5/ 5

bucchi naidu kandriga thoorpu veedhi ott movie review
bucchi naidu kandriga thoorpu veedhi ott movie review

ప‌చ్చ‌ని ప‌ల్లెటూరు.. కులాంత‌ర ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో న‌వ‌త‌రం న‌టీన‌టుల‌తో తెర‌కెక్కించిన తాజా ఓటీటీ చిత్రం ‘బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి’. కృష్ణ పోలూరు దర్శకుడు. ఇదివ‌ర‌కూ రిలీజైన‌ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. తాజాగా `ఆహా` ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఆహా అనిపించిందా?  లేదా అన్న‌ది స‌మీక్షిస్తే..

కథాక‌మామీషు:

ప‌వ‌ర్ స్టార్ సినిమాలు చూసే హీరో బాలు (మున్నా) ప్రేమ‌క‌థ బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి అనే విలేజీలో ఎలా సాగింది? అన్న‌దే ఈ  సినిమా క‌థాంశం. క్లాస్ మేట్ కం ఎదురింట‌మ్మాయితో బాలు ల‌వ్వాయ‌ణం చివ‌రికి  ఏ కంచికి చేరింది?  ఈ క‌థ‌లో కుల‌త‌త్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించింది?  అన్ని ప్రేమ‌క‌థ‌ల్లానే ఇంట్లో పెద్ద‌లు ఒప్పుకోక‌పోతే ఆ ప్రేమికులు ఏం చేశారు? అటుపై ఎలాంటి ట్విస్టులు ఎదుర‌య్యాయి? అన్న‌దే సినిమా.

మూవీ ఆద్యంతం ప‌చ్చ‌ని ప‌ల్లెటూరిలో ఆహ్లాదంగా సాగుతుంది. ప్రేమ‌గువ్వ‌ల రొమాంటిక్ స‌న్నివేశాల‌తో రంజింప‌జేస్తూ బ్యాక్ గ్రౌండ్ లో అద్భుత సంగీతాన్ని ఆస్వాధించే వీలు క‌లుగుతుంది. ఇక ఇందులో ద్వితీయార్థం.. ల్యాగ్ బోర్ క‌లిగిస్తుంది. కామెడీ ఆశించినంత వ‌ర్క‌వుట్ కాలేదు. స్వప్న(దృషిక చందర్)ని ప్రేమించిన బాలు మ‌న‌స్త‌త్వం ..ప‌రువు కోసం ప్రాణం తీసే పెద్ద‌మ‌నుషుల క‌థ‌ను ప్ర‌భావ‌వంతంగా జొప్పించారా? అంటే దానికి స‌మాధానం సినిమా చూస్తేనే తెలుస్తుంది.

న‌టీన‌టులు:
నాయ‌కానాయిక‌లు కొంత‌వ‌ర‌కూ ఫ‌ర్వాలేద‌నిపించినా చాలా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. బాల్యం ఎపిసోడ్లు గుడ్. ఉద్వేగాన్ని పండించే స‌న్నివేశాల్లో నాయ‌కానాయిక‌లు మ‌రింత బెట‌ర్ మెంట్ చూపించాల్సింది. కేరాఫ్ కంచ‌ర‌పాలెం ఫేం సుబ్బారావు న‌ట‌న గుడ్. స్నేహితుల గుంపులో లంబు – జంబు బాగానే న‌వ్వించారు. ఇత‌రులు జ‌స్ట్ ఓకే. చిత్తూరు యాస ప్ర‌య‌త్నించినా అంత‌గా ప్ర‌యోజ‌నం లేదు.

టెక్నీషియ‌న్లు:
విజువ‌ల్ బ్యూటీతో పాటు నేప‌థ్య‌సంగీతం ఆహ్లాదాన్ని పంచుతాయి. రామ్ మ‌హేష‌న్ కెమెరా వ‌ర్క్ బావుంది. మిహిరాంశ్ పాటలు, నేపధ్య సంగీతం ప్ల‌స్‌. నిర్మాణ విలువ‌లు ఓకే. ఎడిటింగ్ షార్ప్ నెస్ పెంచాల్సింది. ద‌ర్శ‌కుని ఎత్తుగ‌డ ఔట్ డేటెడ్. అది కూడా ప్ర‌భావ‌వంతంగా చూప‌లేక‌పోయాడు.

ప్ల‌స్ పాయింట్స్‌:

*ప్లెజెంట్ విజువ‌ల్స్.. నేటివిటీ
* చ‌క్క‌ని సంగీతం

మైన‌స్ పాయింట్స్:

* రొటీన్ ప్రేమ‌క‌థ‌..
* క‌థ‌నంలో ల్యాగ్
* ద్వితీయార్థం బోరింగ్

ముగింపు:
ఎమోష‌న్ లేని కులాంత‌ర ప్రేమ‌క‌థ‌.. వినోదం సున్నా..

రేటింగ్:
1.5/ 5