పెళ్లికి సిద్ధమైన జబర్థస్త్ ఆర్టిస్ట్ షబీనా.. వైరల్ అవుతున్న ఎంగేజ్మెంట్ ఫొటోస్!

మొదట జబర్దస్త్ లో కేవలం మగవారు మాత్రమే కనిపించేవారు. జబర్దస్త్ లో కామెడీ చేయటానికి మగవారు లేడీ గెటప్ వేసుకొని సందడి చేసేవారు. అయితే కొంతకాలంగా జబర్దస్త్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో జబర్దస్త్ లో లేడీస్ కి కూడా అవకాశం కల్పించారు. ఇలా జబర్థస్త్ ద్వారా ఎంతోమంది లేడి కమెడియన్లుగా బాగా ఫేమస్ అయ్యారు. ఇలా జబర్థస్త్ ద్వార ఫేమస్ అయిన లేడి కమెడియన్స్ లో షబీనా కూడా ఒకరు. జబర్దస్త్ కి రాకముందు షబీనా హలో టీవీ సీరియల్స్ లో నటించింది. ఇలా టీవీ సీరియల్స్ లో నటిస్తూ అప్పుడప్పుడు జబర్దస్త్ లో కూడా కనిపించేది.

కెవ్వు కార్తీక్ టీమ్ లో స్కిట్స్ చేశిన షబీనా జబర్ధస్త్ ద్వార బాగా పాపులర్ అయ్యింది. ఇక ఈ షో లో కెవ్వు కార్తీక్, షబీనా లవ్ ట్రాక్ వర్కౌట్ చేయటానికి చాలా ప్రయత్నించారు. మధ్యలో పొట్టి నరేశ్ అడ్డం దూరి షబీనా తో లవ్ అంటూ తిరిగేవాడు. గతంలో సుధీర్ రష్మీ, వర్ష ఇమాన్యుల్, సుజాత రాకింగ్ రాకేష్ జంటల లాగా కాకపోయినా వీరి జంట కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇలా సీరియల్స్ జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన షబీనా తొందర్లోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది.

ఇటీవల సోషల్ మీడియాలో తన ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేస్తూ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. తన ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తన ఫాలోవర్స్ కి తెలియజేసింది. ప్రస్తుతం షబీనా ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. జులై 17వ తేదీన వీరు నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది. మున్నా అనే వ్యక్తిని షబీనా వివాహం చేసుకోబోతోంది. జూలై 17వ తేదీన జరిగిన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను సరిగ్గా నేల తర్వాత ఆగస్టు 17వ తేదీన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకి కాబోయే భర్తను టాగ్ చేసింది. షబీనా ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.