ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కు ఈ రోజు బైపాస్ ఆపరేషన్ జరిగింది. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ సర్జరీ చేసారు. ఆదివారం ఆయన ఊపిరి పీల్చలేని స్దితిలో పరిస్థితి క్రిటికల్ గా ఉండటంతో ముంంబై ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కు తీసుకువచ్చి జాయిన్ చేసారు.
ఈ రోజు ఉదయం కార్డియాక్ సర్జన్ రామకుంట పాండ ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతమైనంది. ఆయన పరిస్దితి స్టేబుల్ గా ఉంది. ఓ వారం రోజులు పాటు హాస్పటిల్ లో ఉండాలి.
ఇక బ్రహ్మానందం రీసెంట్ గా ఎన్టీఆర్ కధానాయకుడులో ..రేలంగి పాత్రలో కనిపించారు. దాదాపు వెయ్యికు పైగా సినిమాల్లో నటించిన ఆయన సౌతిండియాలో టాప్ కమిడియన్ గా వెలిగారు.