బాక్సాఫీస్ : హిందీలో “కార్తికేయ 2” 6 రోజుల వసూళ్లు ఎలా వచ్చాయంటే.!

ఇండియన్ సినిమా దగ్గర భారీ మార్కెట్ ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ బాలీవుడ్. అక్కడ సినిమా కానీ క్లిక్ అయితే అది వసూళ్లు నమోదు అవుతాయి. అయితే ఇప్పుడు వారి సినిమాల పరిస్థితి దారుణంగా ఉంది కానీ మన తెలుగు సినిమాలు మాత్రం అక్కడ వారి సినిమాలను మించి ఆదరణను అందుకుంటున్నాయి.

ఇలా లేటెస్ట్ గా అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో స్ట్రాంగ్ గా నిలబడుతుంది. మరి లేటెస్ట్ గా అయితే ఈ సినిమా హిందీ వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. ఈ చిత్రం మొదటి రోజు కేవలం 7 లక్షల నెట్ వసూళ్లు మాత్రమే వసూలు చేయగా రెండో రోజుకి 28 లక్షలు అందుకుంది.

ఇక మూడో రోజు నుంచి అయితే ఒక కోటికి వసూళ్లు తగ్గలేదు. దీనితో ఐదవ రోజు 1.38 కోట్లు అలాగే ఆరవ రోజుకి గాను 1.64 కోట్లు వసూలు చేసింది. దీనితో అయితే మొత్తం ఆరు రోజుల్లో హిందీ వెర్షన్ లో కార్తికేయ 2 – 5.75 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది.

ఇక ఈరోజు కృష్ణాష్టమి కావడం పైగా భారీ స్థాయిలో స్క్రీన్స్ మరియు షోస్ జరిగింది. దీనితో అయితే ఈరోజు మాత్రం 2 కోట్లకి పైగా వసూళ్లు రావచ్చని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. మరి ఈరోజు వసూళ్లు అయితే ఎలా వస్తాయో చూడాల్సిందే. ఇంకా ఈ సినిమాలో అయ్యితే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మించారు.