బాలీవుడ్‌ రీమేక్‌పై నాని కన్ను

అన్ని ఇండస్ట్రీలలో రీమేక్‌ల ట్రెండ్‌ నడుస్తుంది. ఒక భాషలో ఘనవిజయం సాధించిన సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్‌ చేస్తున్నారు మేకర్స్‌. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ బాలీవుడ్ సూపర్‌హిట్ చేరనుంది.

ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా హిందీలో ఘనవిజయం సాధించిన సినిమా అంధాధున్‌. ఈ సినిమాలో నటనకు గాను ఆయుష్మాన్‌ జాతీయ అవార్డును కూడా సాధించాడు.ఈ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరగుతున్నాయి.ఇప్పటికే తమిళ వర్షన్‌లో ప్రశాంత్‌ హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు తెలుగు వర్షన్‌ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు నాని ఆసక్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.