బాలీవుడ్ టాక్ : “ఆదిపురుష్” ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఏమంటున్నారంటే.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న పలు భారీ చిత్రాల్లో దర్శకుడు ఓంరౌత్ తో చేసిన సెన్సేషనల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “ఆదిపురుష్” కూడా ఒకటి. హిందీలో తాను చేసిన ఫస్ట్ సినిమా ఇదే కావడంతో బాలీవుడ్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

పైగా ఈ చిత్రాన్ని రామాయణం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించగా ప్రభాస్ శ్రీరామునిగా అలాగే కృతి సనన్ జానకి దేవి పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు నుంచో అభిమానులు ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా అది ఇప్పుడు అప్పుడు అంటూ చాలానే లేట్ అవుతూ వస్తుంది.

అయితే ఈ దసరా కానుకగా సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ కూడా వస్తుందని స్వయంగా నిర్మాతే చెప్పడంతో అందరిలో ఓ రేంజ్ ఆసక్తి స్టార్ట్ అయ్యింది. కానీ మళ్ళీ మేకర్స్ ఈ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లారని తెలిసింది. కానీ ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ వర్గాలు నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే..

ఓ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఒకో అప్డేట్ ని రివీల్ చెయ్యాలని భాగంగా మొదట ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసారని అంటున్నారు. మరి దాని ప్రకారం ఈ సెప్టెంబర్ 26న ఈ పోస్టర్ రావచ్చట. ఇదెంత వరకు నిజమో ఏంటో చూడాలి.